ETV Bharat / bharat

2021 చివర్లో అమెరికాకు మోదీ! - మోదీ అమెరికా పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది చివర్లో మోదీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు సమాచారం.

modi, PM Modi
మోదీ, నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 15, 2021, 2:39 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది చివరలో అమెరికాలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇటీవలే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ వర్చువల్​గా హాజరైన నేపథ్యంలో ఈ పర్యటన అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

తొలుత 47వ జీ-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. కానీ, కరోనా నేపథ్యంలో మోదీ ఈ సదస్సుకు హాజరుకావట్లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కొవిడ్​ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించలేదు. ఈ ఏడాదిలో మొదటిసారిగా మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.