దేశంలో తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం అధికారులు సమావేశమయ్యారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశమున్న తరుణంలో.. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు.
ఈ నెల 4న.. ఒడిశాలో తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. అన్ని ఏర్పాట్లు చేయాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి:- 'అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'