PM Modi BRICS summit South Africa : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకోనున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన 15వ బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు ఆగస్టు 22-24 తేదీల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు మోదీ.
-
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.
— ANI (@ANI) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/hRy220autL
">#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.
— ANI (@ANI) August 22, 2023
He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/hRy220autL#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.
— ANI (@ANI) August 22, 2023
He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/hRy220autL
బ్రిక్స్ సదస్సుతో పాటు.. బ్రిక్స్-ఆఫ్రికా అవుట్‌రీచ్ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పర్యటనకు బయల్దేరే ముందు ట్వీట్ చేసిన మోదీ.. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. వైవిధ్యమైన రంగాల్లో సంబంధాల బలోపేతానికి బ్రిక్స్ కృషి చేస్తోందని పేర్కొన్నారు మోదీ. సదస్సుకు హాజరయ్యే నేతల్లోని 'కొంతమంది'తో తాను సమావేశమవుతానని వెల్లడించారు.
-
Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023
"వివిధ రంగాల్లో సహకారం బలోపేతం అయ్యేందుకు అజెండా రూపకల్పనలో బ్రిక్స్ తోడ్పడుతోంది. గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలపై చర్చించేందుకు బ్రిక్స్ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్‌లో నేను బ్రిక్స్ సదస్సుతో పాటు బ్రిక్స్ ఆఫ్రికా అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొంటా. బ్రిక్స్ ప్లస్ చర్చల్లో భాగమవుతా. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం పొందిన అతిథులతో సంభాషించేందుకు ఎదురుచూస్తున్నా. జొహన్నెస్‌బర్గ్‌కు వచ్చే దేశాధినేతల్లోని కొందరితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మరోవైపు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆయన జొహన్నెస్‌బర్గ్‌లో దిగారు. జిన్‌పింగ్‌కు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్వాగతం పలికారు.
కాగా, ఈ బ్రిక్స్ సమావేశాల్లో జిన్‌పింగ్, మోదీ ద్వైపాక్షిక భేటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. భారత విదేశాంగ శాఖ సైతం దీనిపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. ప్రధాని ద్వైపాక్షిక భేటీలు ఇంకా ఖరారు కాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల తర్వాత మోదీ, జిన్‌పింగ్ సమావేశం కాలేదు. గతేడాది ఇండోనేసియాలో జీ20 సమావేశాల సందర్భంగా ఇరువురూ కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో అధికారిక భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
PM Modi South Africa Visit : బ్రిక్స్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా?