ETV Bharat / bharat

'కర్తార్​పుర్​ కారిడార్​తో దేశ ప్రజల కల నెరవేరింది' - పీఎం మోదీ

Modi in Gurpurab celebrations: కర్తార్​పుర్​ కారిడార్​ ద్వారా కర్తార్​పుర్​ సాహిబ్​ను సులభంగా చేరుకోవాలనే దేశ ప్రజల కల నెరవేరిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురునానక్​ దేవ్​ జీ గురుపురబ్​ ఉత్సవాలకు వర్చువల్​గా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Dec 25, 2021, 1:34 PM IST

Modi in Gurpurab celebrations: కర్తార్​పుర్​ సాహిబ్​కు సులభంగా చేరుకోవాలన్న దేశ ప్రజల ఆకాంక్ష.. కర్తార్​పుర్​ కారిడార్​ ద్వారా సాధ్యమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2019లో కర్తార్​పుర్​ కారిడార్​ పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు.

గుజరాత్​, కచ్​లోని గురుద్వారా లఖ్​పత్​ సాహిబ్​లో నిర్వహించిన గురునానక్​ దేవ్​ జీ గురుపురబ్​ ఉత్సవాల్లో.. వర్చువల్​ మాట్లాడారు మోదీ.

"ఖాస్లా పంత్​ను ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన నాలుగో గురుసిఖ్​ భాయ్​ మోఖమ్​ సింగ్​ జీ గుజరాతీ కావటం రాష్ట్రానికే గర్వకారణం. గురు తేగ్​ బహదూర్​ జీ 400 ఏళ్ల ప్రకాశ్​ ఉత్సవాలను 2021లో జరుపుకుంటున్నాం. అఫ్గానిస్థాన్​ నుంచి గురు గ్రంథ్​​ సాహిబ్​ పత్రాలను తీసుకురావటంలో సఫలమైన విషయాన్ని మీరూ చూశారు. ఇది సంతోషకర విషయం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఔరంగజేబ్​పై గురు తేజ్​ బహదూర్​ శౌర్యం.. దేశం ఉగ్రవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతుందో బోధిస్తుందన్నారు మోదీ. అలాగే.. పదో గురు.. గురు గోబింద్​ సింగ్​ సాహిబ్​ జీవితం పట్టుదలకు, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:

Modi news: 'కర్తార్​పుర్​ కారిడార్ మళ్లీ​ తెరుచుకోవడం సంతోషకరం'

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా సాకారమైందిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.