ETV Bharat / bharat

ఈ మూడు నెలలు జాగ్రత్త.. లేదంటే అంతే! - కరోనా టీకా

పండుగలు, వివాహాలు అధికంగా ఉన్న అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కరోనా విషయంలో (Covid-19 News) జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వేడుకల్లో వర్చువల్​గా పాల్గొనడం సహా జన సమూహం అధికంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ హితవు పలికారు. దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, రోజూ సగటున 20వేల కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.

Covid-19
కరోనా కేసులు
author img

By

Published : Oct 7, 2021, 6:37 PM IST

అక్టోబర్​, నవంబర్​, డిసెంబర్​ నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health India). ఈ మూడు నెలల కాలంలో పండుగలు, పెళ్లిళ్లు అధికంగా ఉండటం వల్ల కరోనా (Covid-19 News) మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని చెప్పింది. కాబట్టి, ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా.. వేడుకల్లో వర్చువల్​గా పాల్గొనాలని సూచించింది.

మహమ్మారి రెండో దశ (Covid-19 India) ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోజువారీ కేసుల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఇప్పటికీ ప్రతిరోజు 20వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పింది.

"ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడినా, ఇదే కొనసాగుతుందని అనుకోకూడదు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మహమ్మారి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అనవసర ప్రయాణాలు చేయకుండా, షాపింగ్​ కోసం ఆన్​లైన్​ను ఆశ్రయించడం మేలు."

- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

గతవారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో (Covid-19 Cases in India) 50శాతం కేరళలోనే వెలుగుచూశాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.

మిజోరం, కేరళ, సిక్కిం, మణిపుర్, మేఘాలయాలో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 జిల్లాల్లో.. వీక్లీ పాజిటివిటీ రేటు (Weekly Positivity Rate India) 10శాతానికి పైగా ఉందని వెల్లడించింది.

దేశంలోని వయోజనుల్లో 71 శాతం మంది కనీసం ఒక డోసు కరోనా టీకా తీసుకున్నారని, 27శాతం మంది రెండు డోసులూ వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.

సిద్ధంగా ఉన్నాం..

కరోనా కేసుల విషయంలో (Coronavirus News) ఏదైనా ఊహించని పరిస్ధితి వస్తే ఎదుర్కోవడానికి 8.36 లక్షల పడకలు, మరో 10లక్షల ఐసోలేషన్‌ పడకలను అందుబాటులో ఉంచినట్లు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో టీకా లభ్యత సమస్యలు లేవని చెప్పారు.

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) బుధవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 22,431 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. 24,602 మంది కరోనాను జయించారు.

వ్యాక్సినేషన్​..

బుధవారం కొత్తగా 43,09,525 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు (Covid Vaccination in India) కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 92,63,68,608కి చేరినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: ఉరుముతున్న మూడో ముప్పు- అప్రమత్తతతోనే అడ్డుకట్ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.