ETV Bharat / bharat

'దేశంలోని విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్​కోడ్ నిబంధన!' - Karnataka PU Colleges holiday

Common dress code Supreme Court: విద్యా సంస్థల్లో డ్రెస్​కోడ్ నిబంధన అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డ్రెస్​కోడ్ వల్ల విద్యార్థుల్లో సమానత్వం, సోదరభావం పెంపొందించినట్లు అవుతుందని పేర్కొంది. మరోవైపు, కళాశాలలకు సెలవులు పొడగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Hijab Supreme Court
Hijab Supreme Court
author img

By

Published : Feb 12, 2022, 3:50 PM IST

Common dress code Supreme Court: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్​కోడ్ నిబంధనను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులతో పాటు సిబ్బందికీ ఈ దుస్తుల నిబంధన ఉండాలేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని వ్యాజ్యంలో కోరారు. నిఖిల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి న్యాయవాదులు అశ్వినీ ఉపాధ్యాయ్, అశ్వనీ దుబేల ద్వారా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. డ్రెస్​కోడ్ అమలు చేయడం ద్వారా జాతీయ సమైఖ్యత, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించినట్లవుతుందని అన్నారు. ఇందుకోసం కేంద్రం ఓ జ్యుడిషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించి.. విద్యార్థుల్లో ఐక్యత, జాతీయ సమైఖ్యతను పెంపొందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Hijab Supreme Court:

"విద్యా సంస్థలు బహిరంగ లౌకిక ప్రదేశాలు. జ్ఞానం పెంపొందించేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, దేశాభివృద్ధికి పాటుపడేందుకు ఈ సంస్థలు పనిచేస్తాయి. అవసరమైన, అవసరం లేని మతపరమైన పద్ధతులను పాటించేందుకు కాదు. విద్యా సంస్థల లౌకిక భావాన్ని కాపాడేందుకు అన్ని కళాశాలలు-పాఠశాలల్లో సాధారణ డ్రెస్​కోడ్ నిబంధన తీసుకురావడం చాలా ముఖ్యం. ఏకరూపత కోసమే కాకుండా.. వేర్వేరు ప్రదేశాలు, మతాలు, కులాలు, సంస్కృతులకు చెందిన విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందించేందుకు డ్రెస్​కోడ్ ఉపయోగపడుతుంది. లేదంటే రేపు ఓ నాగ సాధు కళాశాలలో అడ్మిషన్ తీసుకొని... మతాచారం పేరుతో వస్త్రాలు ధరించకుండానే తరగతులకు హాజరయ్యే ప్రమాదం ఉంది."

-సుప్రీంలో దాఖలైన వ్యాజ్యం

అమెరికా, యూకే, ఫ్రాన్స్, సింగపూర్, చైనా దేశాల్లో డ్రెస్​కోడ్ నిబంధన ఉందని పిటిషనర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఓ సర్వే గురించి ప్రస్తావించారు. 'ఓ సర్వే ప్రకారం 2018లో 2.5 లక్షల తుపాకులను కళాశాలలు, పాఠశాలల్లోకి తీసుకొచ్చారు. డ్రెస్​కోడ్ నిబందన తీసుకురావడం వల్ల బెల్ట్​లైన్ బయటకు కనిపిస్తుంది. ఆయుధాల భయం ఉండదు' అని చెప్పుకొచ్చింది.

సెలవులు..

Karnataka PU Colleges holiday: మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం ప్రీ-యూనివర్సిటీ కాలేజీలకు సెలవులు పొడగించింది. ఫిబ్రవరి 15 వరకు సెలవులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. శాంతి భద్రతలు కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. డిగ్రీ, డిప్లొమా కళాశాలలు ఫిబ్రవరి 16 వరకు మూసే ఉండనున్నాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఫిబ్రవరి 14 నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి.

గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

ఇదీ చదవండి: దిల్లీ నడి వీధిలో ఇనుప రాడ్లతో దాడి.. దృశ్యాలు వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.