ETV Bharat / bharat

వీళ్ల రూటే సెపరేటు! రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు!! ఎందుకో తెలుసా? - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్

ఈ గ్రామస్థులు రూటే.. సెపరేటు! అందరూ టికెట్​ కొని ట్రైన్​లో ప్రయాణిస్తుంటే.. వీళ్లు మాత్రం టికెట్​ కొని ప్రయాణించకుండానే ఇంటికి వెళ్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి..

People buy tickets without traveling
People buy tickets without traveling
author img

By

Published : Mar 8, 2023, 4:47 PM IST

Updated : Mar 8, 2023, 7:00 PM IST

వీళ్ల రూటే సెపరేటు! రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు!! ఎందుకో తెలుసా?

టికెట్​ లేకుండా రైలు ఎక్కే వాళ్లు సహజం. కానీ రైలు ఎక్కకుండానే టికెట్​ కొనేవాళ్లను చూశారా..? ఇదేంటి టికెట్​ కొని ప్రయాణం చేయకుండా ఎందుకు ఉంటారు అని ఆలోచిస్తున్నారా? దీని వెనుక ఓ పెద్ద స్టోరీ ఉందండి.. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి..

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​ సమీపంలో దయాల్​పుర్​ అనే రైల్వే స్టేషన్​ ఉంది. దీనిని స్వాతంత్ర్యం వచ్చాక ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్​లాల్ నెహ్రూ, రైల్వే మంత్రి లాల్​బహుదుర్ శాస్త్రి ప్రతిపాదనల మేరకు 1954లో నిర్మించారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు అనేక మంది ప్రయాణికులు ఈ స్టేషన్​ను నుంచి రాకపోకలు సాగించారు. కానీ కొన్నేళ్ల తర్వాత స్టేషన్​కు ఆదాయం రావడం తగ్గిపోయింది. దీంతో 2006 ఈ స్టేషన్​ను మూసివేశారు ఉత్తర మండల రైల్వే అధికారులు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్​ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్​పుర్​ ప్రజలు కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చారు. అనేక సంవత్సరాల పోరాటం అనంతరం 2022 జనవరి ఈ స్టేషన్​ను తిరిగి ప్రారంభించారు రైల్వే అధికారులు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్​ ప్రారంభం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు గ్రామస్థులు.

People buy tickets without traveling
దయాల్​పుర్​ రైల్వే స్టేషన్​

స్టేషన్ తిరిగి ప్రారంభించిన కొత్తలో టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు టికెట్ అమ్మకాలు పడిపోయాయి. ఇన్నేళ్లు కష్టపడి.. తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్​ మళ్లీ మూతపడితే ఎలా అన్న సందేహం వారిలో మొదలైంది. స్టేషన్​ మూతపడకుండా ఉండేందుకు పరిష్కారం కోసం అంతా ఆలోచించారు. అందుకోసమే స్టేషన్​ ఆదాయం పడిపోకుండా వచ్చి టికెట్లు కొని ప్రయాణించకుండా వెళ్తున్నారు గ్రామస్థులు. అలా.. 2022 డిసెంబర్​ వరకు నెలకు సుమారు 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీనిని గమనించిన గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారు. స్టేషన్​ ఆదాయం తగ్గిపోయినప్పుడల్లా తాము వెళ్లి టికెట్​ కొని ప్రయాణించకుండా వచ్చేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

People buy tickets without traveling
దయాల్​పుర్​ రైల్వే స్టేషన్​ వద్ద గ్రామస్థులు

"మొదట రైల్వే స్టేషన్​ను ప్రారంభించిన తర్వాత ఆదాయం లేక మూసివేశారు. కానీ మేము ఈ స్టేషన్​ను తిరిగి తెరిపించాలి అనుకున్నాం. అందుకే ప్రయాణించకున్నా వచ్చి టికెట్లు కొంటున్నాం. గత 2-3 నెలలుగా ఇలానే కొనుగోలు చేస్తున్నాం. కేవలం మా గ్రామంలో రైల్వే స్టేషన్​ కొనసాగడానికి ఇలా చేస్తున్నాం."

--గ్రామస్థుడు

"రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడు టికెట్​ కొనాలి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ వసతులను కల్పిస్తాం. టికెట్​ అమ్మాకాలు పూర్తిగా పడిపోయినప్పుడు మాత్రమే స్టేషన్​ను మూసివేస్తాం. సాధారణంగా రైల్వే నిబంధనల ప్రకారం బ్రాంచ్​లైన్​లో ఉన్న స్టేషన్​లో కనీసం 25 టికెట్లు, మెయిన్​ లైన్​లో ఉన్న స్టేషన్​లో కనీసం 50 టికెట్లు అమ్ముడుపోవాలి. ఒక స్టేషన్​లో రైలు హాల్టింగ్​ నిర్ణయం లాగే.. స్టేషన్​ మూసివేతపై నిర్ణయం పూర్తిగా రాష్ట్ర స్థాయి అధికారులకే ఉంటుంది."

--హెచ్​ఎస్​ ఉపాధ్యాయ్​, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్​, ఉత్తర మండల రైల్వే

People buy tickets without traveling
హెచ్​ఎస్​ ఉపాధ్యాయ్​, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్​, ఉత్తర మండల రైల్వే
People buy tickets without traveling
దయాల్​పుర్​ రైల్వే స్టేషన్​ ఛార్జీల బోర్డ్​
People buy tickets without traveling
దయాల్​పుర్​ రైల్వే స్టేషన్​లో రైలు

ఇవీ చదవండి : రెండు చేతులతో వేర్వేరు భాషలు రాస్తున్న యువతి.. ప్రపంచ రికార్డులు దాసోహం

ప్రేమకు నో చెప్పిన లేడీ లాయర్​.. కోపంతో ముక్కు కొరికిన న్యాయవాది.. విమెన్స్​ డే సెలెబ్రేషన్స్​లోనే..

Last Updated : Mar 8, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.