ETV Bharat / bharat

'ఓబీసీ బిల్లు ఆమోదం ఓ చారిత్రక ఘట్టం'

author img

By

Published : Aug 12, 2021, 6:18 AM IST

రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లును ఆమోదించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఈ బిల్లు ఆమోదించడాన్ని ఓ మైలు రాయిగా అభివర్ణించారు.

Modi, OBC bill
మోదీ, ఓబీసీ బిల్లు

పార్లమెంటులో ఓబీసీ బిల్లు ఆమోదం పొందడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అట్టడుగు వర్గాలవారికి గౌరవం, అవకాశం, న్యాయం అందించడంలో తమ ప్రభుత్వ నిబద్ధతతో పని చేస్తోందన్నారు.

"127వ రాజ్యాంగ సవరణ బిల్లు-2021 ఉభయ సభలు ఆమోదించడం ఓ మైలురాయి. ఈ బిల్లు సామాజిక సాధికారతను మరింత పెంపొందిస్తుంది. ఇది అట్టడుగు వర్గాల వారిగి గౌరవం, అవకాశం, న్యాయం అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అంటూ మోదీ ట్వీట్​ చేశారు.

రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని వాటికే అప్పగించేందుకు ఉద్దేశించిన ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్య​సభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్​సభలో మంగళవారం ఆమోదం పొందింది.

ఇదీ చూడండి: ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాలుగేళ్ల స్ఫూర్తి ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.