Om Birla Meeting All Party Leaders: జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. ప్రతి ఒక్క సభ్యుడు.. సభా మర్యాదలను కచ్చితంగా కాపాడాలని తెలిపారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన.. అన్ని పార్టీల నేతలకు వివరించారు.
'అగ్నిపథ్‌పై చర్చకు డిమాండ్'
త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. సభలో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షానికి తగినంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఓట్ల కోసం ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం'