ETV Bharat / bharat

ఈ పిల్లవాడు.. భారత్​- పాకిస్థాన్​ 'బార్డర్​'!

A child named as a Border: 2021 డిసెంబర్​ 2న భారత్​-పాకిస్థాన్​ మధ్య కొత్త 'బార్డర్​' వచ్చింది. అదేంటి సరిహద్దులు ఎప్పుడో నిర్ణయించారు కదా.. అని ఆలోచిస్తున్నారా? రెండు దేశాలను విడదీసే ప్రాంతం కాదండి? ఇరు దేశాల సరిహద్దులో పుట్టిన ఓ పిల్లవాడి రూపంలో అది సాధ్యమైంది. ఎలాగంటారా?

Border
బార్డర్​లో జన్మించిన బాలుడు
author img

By

Published : Dec 6, 2021, 6:51 PM IST

Updated : Dec 6, 2021, 8:32 PM IST

అట్టారి వాఘా సరిహద్దులో పాకిస్థానీలు

A child named as a Border: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రాంతాల పేర్లను పిల్లలకు పెట్టటం తెలిసిందే. అయితే, ఓ పిల్లవాడికి భారత్​-పాక్​ 'బార్డర్​'గా నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఈ సంఘటన పంజాబ్​లోని అట్టారీ-వాఘా సరిహద్దులో జరిగింది.

పాకిస్థాన్​కు చెందిన ఓ మహిళ ఈనెల 2వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇండో-పాక్​ సరిహద్దులో పుట్టిన ఆ పిల్లాడికి 'బార్డర్​' అని పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు నింబు బాయి, బలమ్​ రామ్​ తెలిపారు.

Border
తల్లిదండ్రులు నింబుబాయి, బలమ్​ రామ్​

పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులతో పాటు మరో 97 మంది పాకిస్థానీలు భారత్​కు వచ్చారు. ఆ తర్వాత కరోనా విజృంభించటం వల్ల లాక్​డౌన్​ విధించటం, పాక్​ సరిహద్దులు మూసివేయడం సహా సరైన పత్రాలు లేకపోవటం వల్ల అట్టారీ-వాఘా సరిహద్దుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నింబు బాయి గర్భవతి. డిసెంబర్​ 2న కూలీ పనులకు వెళ్లగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. సమీప గ్రామాల ప్రజలు వచ్చి పురుడు పోశారు. వైద్య సహాయం అందించారు.

మరో పిల్లాడికి 'భారత్​'గా నామకరణ

రెండోవేవ్​ లాక్​డౌన్​ కన్నా ముందు తమతో పాటు 98 మంది పాకిస్థానీ పౌరులు భారత్​కు వచ్చినట్లు బలమ్​ రామ్​ తెలిపారు. సరిహద్దులు మూసివేయటం వల్ల ఇక్కడే చిక్కుకుపోయామని చెప్పారు. పాకిస్థానీల్లో 47 మంది పిల్లలు సైతం ఉన్నారు. అందులో ఆరుగురు భారత్​లోనే జన్మించటం గమనార్హం. అంతా ఏడాదిలోపు వారే.

లాగ్యా రామ్​ అనే వ్యక్తి సైతం తన కుటుంబంతో అట్టారీ సరిహద్దుల్లోనే నివసిస్తున్నారు. గత ఏడాదిలో జన్మించిన తన కుమారుడికి 'భారత్​'గా పేరు పెట్టారు. జోధ్​పుర్​లో తన సోదరుడిని కలిసేందుకు వచ్చిన లాగ్యా రామ్​ తిరిగి పాకిస్థాన్​కు వెళ్లలేక అట్టారీలో ఉంటున్నట్లు చెప్పారు.

సరిహద్దులోనే ఉండేందుకు కారణం?

భారత్​లో పుట్టిన పిల్లలకు పాస్​పోర్టులు కావాలని సరిహద్దు అధికారులు అడుగుతున్నారని, తమ వద్ద తినేందుకే డబ్బులు లేవని వాపోతున్నారు పాకిస్థానీలు. తమతో వచ్చిన వారు సొంత దేశానికి వెళ్లిపోతుంటే తాము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. తమను స్వదేశం పంపించేందుకు సహకరించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: అతడి నుంచి గిఫ్ట్​గా ఖరీదైన పిల్లులు.. అందుకే ఆ నటికి ఇన్ని కష్టాలు!

Last Updated : Dec 6, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.