ETV Bharat / bharat

బిపిన్ రావత్​కు పద్మవిభూషణ్.. స్వీకరించిన కుమార్తెలు - Padma Vibhushan

Padma awards: దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Padma awards
పద్మ అవార్డుల ప్రదానోత్సవం
author img

By

Published : Mar 21, 2022, 5:22 PM IST

Updated : Mar 21, 2022, 6:20 PM IST

Padma awards: పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

భారత తొలి సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​కు మరణానంతరం పద్మ విభూషణ్​ ప్రకటించగా.. ఆయన కుమార్తెలు క్రితిక, తరణి అవార్డును అందుకున్నారు. ​రాధే శ్యామ్​ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును స్వీకరించారు.

పద్మ భూషణ్​..

సీనియర్​ కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​ పద్మ భూషణ్​ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. పారాలింపిక్​ రజత పతక విజేత దేవేంద్ర ఝఝారియా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఎండీ సైరస్​ పూనావాలా, సచిదానంద స్వామి సహా పలువురికి పద్మ భూషణ్​ అవార్డులను ప్రదానం చేశారు కోవింద్​.

పద్మ శ్రీ..

ఇండియన్​ డైరెక్టర్​ చంద్రప్రకాశ్​ ద్వివేది, హాకీ క్రీడాకారిణి వందనా కటారియా, పారా-షూటర్​ అవని లేఖరా, స్వామి శివానంద సహా పలువురు పద్మ శ్రీ అవార్డులు అందుకున్నారు.

మార్చి 28న రెండో విడత..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది.

Last Updated : Mar 21, 2022, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.