ETV Bharat / bharat

జడ్ కేటగిరీ భద్రత స్వీకరించండి.. ఒవైసీకి షా విజ్ఞప్తి - అసదుద్దీన్ ఒవైసీ అమిత్ షా

Owaisi security amit shah: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. హాపుర్ జిల్లాకు ఒవైసీ వస్తున్నట్టు ముందస్తు సమాచారం అధికారులకు అందలేదని తెలిపారు. ఈ సందర్భంగా జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని ఒవైసీని కోరారు షా.

amit shah owaisi
amit shah owaisi
author img

By

Published : Feb 7, 2022, 3:16 PM IST

Owaisi security amit shah: ప్రభుత్వం అందించే జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తర్​ప్రదేశ్​లో ఒవైసీ కారుపై దాడికి సంబంధించి రాజ్యసభలో ప్రకటన చేశారు. హాపుర్ జిల్లాకు ఒవైసీ వస్తున్నట్లు అధికారులకు సమాచారమేమీ లేదని తెలిపారు. జిల్లాలో ఒవైసీకి ముందస్తు కార్యక్రమాలేవీ లేవని చెప్పారు. ఘటన తర్వాత ఒవైసీ సురక్షితంగా దిల్లీకి చేరుకున్నారని వివరించారు.

Owaisi security uttar pradesh:

"ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. ఆయన(ఒవైసీ) సురక్షితంగా బయటపడ్డారు. ఆయన వాహనం కింది భాగంలో మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. ఘటనను ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు. వెంటనే చర్యలు తీసుకొని ఇద్దరిని అరెస్టు చేశాం. లైసెన్స్ లేని రెండు పిస్తోళ్లు, ఒక ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నాం. ఒవైసీ అక్కడ పర్యటిస్తున్నారని జిల్లా కంట్రోల్ రూమ్​కు ముందుగా ఎలాంటి సమాచారం అందలేదు."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

Amit Shah in Rajya Sabha

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని షా తెలిపారు. కారును ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలు సేకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఒవైసీకి ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉందని తెలిపారు.

"ఘటన తర్వాత కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే నివేదిక తెప్పించింది. భద్రతా సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆయనకు భద్రత కల్పించే ఏర్పాట్లు చేసింది. కానీ ఆయన నిరాకరించడం వల్ల దిల్లీ, తెలంగాణ పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. ఘటన తర్వాత ఒవైసీకి ఉన్న ముప్పును మరోసారి మదింపు చేశాం. జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించాం. కానీ ఆయన మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను బట్టి దీన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉన్నందున.. కేంద్రం అందిస్తున్న జడ్ కేటగిరీ భద్రతను ఒవైసీ స్వీకరించాలని కోరుతున్నా."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

firing on Owaisi car in UP

ఫిబ్రవరి 3న ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాల్పుల వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఈ నేపథ్యంలో జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించగా.. ఒవైసీ భద్రతను నిరాకరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.