ETV Bharat / bharat

'ప్రధాని మౌనవ్రతం ముగించేందుకే అవిశ్వాసం.. వీడియోలు రాకుంటే మోదీ నోరు విప్పేవారు కాదు' - lok sabha no confidence motion

Opposition No Confidence Motion India : మణిపుర్‌పై 30 సెకన్ల పాటు మాట్లాడేందుకు మోదీకి 80 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్​. మహిళల వీడియోలు బయటకు రాకుంటే మోదీ పెదవి విప్పేవారే కాదన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో కాంగ్రెస్ తరఫున చర్చ ప్రారంభించిన ఆయన.. ప్రధానికి మూడు ప్రశ్నలను సంధించారు.

opposition no confidence motion india
అవిశ్వాస తీర్మాన చర్చలో మాట్లాడుతున్న గౌరవ్ గొగొయ్​్
author img

By

Published : Aug 8, 2023, 2:41 PM IST

Opposition No Confidence Motion India : పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనవత్రం పట్టారని.. ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (congress no confidence motion )పై మంగళవారం చర్చ ప్రారంభమైంది. చర్చలో అందరికన్నా ముందుగా మాట్లాడిన గొగొయ్​.. 'మేం అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే పరిస్థితులు తలెత్తాయి. ఇది లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసుకోవడానికి తీసుకువచ్చింది కాదు. మేం ఈ తీర్మానం నెగ్గుతామన్న నమ్మకం కూడా లేదు. కానీ, మణిపుర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకువచ్చాం' అని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధానికి మూడు ప్రశ్నలను సంధించారు. అవి..

  1. ఇప్పటివరకు ప్రధాని మోదీ మణిపుర్‌లో ఎందుకు పర్యటించలేదు?
  2. మణిపుర్‌పై మాట్లాడేందుకు మోదీకి 80 రోజుల సమయం ఎందుకు పట్టింది..? అప్పుడు కూడా కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడతారా..?
  3. ఎందుకు ఇప్పటివరకు మణిపుర్ సీఎంను తొలగించలేదు..?
  • Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to finally speak… pic.twitter.com/lhFomV5XUQ

    — ANI (@ANI) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ దు:ఖ సమయంలో మణిపుర్‌కు ఓ సందేశం వెళ్తుంది. ఈ సభ మొత్తం మణిపుర్‌ వెంట ఉంది. శాంతి కోరుకుంటోంది. ఇది మా కోరిక. కానీ అలా జరగలేదు. ప్రధానమంత్రి మోదీ మౌనవ్రతం చేపట్టారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలనుకున్నాం. మణిపుర్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు విఫలమైంది. మణిపుర్‌ వైరల్‌ వీడియో ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసింది. మణిపుర్ అత్యాచార బాధిత మహిళ భర్త ఒక కార్గిల్‌ సైనికుడు. దేశాన్ని రక్షించిన తాను.. కుటుంబాన్ని కాపాడుకోలేకపోయానని సైనికుడు కన్నీటిపర్యంతమయ్యారు. మణిపుర్‌ వీడియోలు బయటకు రాకుంటే మోదీ పెదవి విప్పేవారే కాదు. మణిపుర్‌లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయి?. ఈ అంశంలో కేంద్రం, రాష్ట్రం వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది."

--గౌరవ్‌ గొగొయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ

Bjp No Confidence Motion : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్​ అనంతరం బీజేపీ తరఫున అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిచారు ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే. ఇది అవిశ్వాసం కాదని.. విపక్షాల విశ్వాస తీర్మానం అని విమర్శించారు. ఈ సభలో ఉన్న చాలామందికి మణిపుర్‌ గురించి తెలియదని.. ఈ అంశంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేనేలేదన్నారు. ఇండియా కూటమిలో చాలామందికి దాని అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు.

  • #WATCH | BJP MP Nishikant Dubey says, "This No Confidence Motion has been brought. Why has this been brought? Sonia ji (Gandhi) is sitting here...I think she has to do two things - Bete ko set karna hai aur Damad ko bhent karna hai...That is the base of this Motion." pic.twitter.com/Gb40E2gfzu

"సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మీరు జడ్జిమెంట్‌ ఇవ్వకూడదు. రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు..స్టే మాత్రమే ఇచ్చింది. మోదీ ఓబీసీ కాబట్టే రాహుల్‌ క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఇండియా కూటమిలో చాలామందిని కాంగ్రెస్‌ జైలుకు పంపింది?. గతంలో పవార్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్‌ జైలుకు పంపింది. ఇండియా కూటమిలో చాలా పార్టీలకు అంతర్గత వైరం ఉంది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది. కుమారుడు, అల్లుడిని కాపాడేందుకు సోనియా కష్టపడుతున్నారు. న్యూస్‌ క్లిక్‌ వెబ్‌సైట్‌ అంశంపై మాట్లాడితే కాంగ్రెస్‌కు ఎందుకు కోపం వస్తోంది. మణిపుర్‌ డ్రగ్‌ మాఫియాకు కాంగ్రెస్‌ గతంలో ప్రోత్సహించింది."

--నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ

Lok Sabha No Confidence Motion : అంతకుముందు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ సమావేశాలు.. గంట పాటు వాయిదాపడ్డాయి. అనంతరం తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా కాకుండా గౌరవ్ గొగొయ్​ చర్చను మొదలుపెట్టారు.

'కూటమిలో ఎవరున్నారో తెలుసుకునేందుకే అవిశ్వాసం'.. ప్రతిపక్షాలపై మోదీ సెటైర్

మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. అస్త్రశస్త్రాలతో పాలక, విపక్షాలు రెడీ.. సభ దద్దరిల్లడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.