ETV Bharat / bharat

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 'ఆళ్వా' నామినేషన్​.. వెంటవచ్చిన పవార్​, రాహుల్​ - లోక్​సభ సెక్రటరీ జనరల్​

Margaret Alva Nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మార్గరెట్​ ఆళ్వా.. మంగళవారం నామినేషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సహా మల్లికార్జున ఖర్గే, ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Opposition candidate Margaret Alva files nomination for Vice Presidential election

author img

By

Published : Jul 19, 2022, 12:53 PM IST

Margaret Alva Nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆళ్వా.. నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, డి. రాజా సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికార పక్షం ఎన్​డీఏ తరఫున సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖడ్​. ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లకు మంగళవారమే ఆఖరి రోజు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఉన్న ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.

ఇవీ చూడండి: ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్​ఖడ్ నామినేషన్

చైనా సరిహద్దులో 18 మంది మిస్సింగ్​.. వారికి ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.