Farmers facing problem with parrots: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన గసగసాల రైతులు చిలుకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్ల మందుకు బానిసైన చిలుకలు.. పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి వాటిని గతంలో వెళ్ల కొట్టినప్పటికీ తిరిగి వస్తున్నాయని చెప్తున్నారు.
గసగసాల పంట చేతికి వస్తున్న సమయంలో దానిలో లోపల ఉండే నల్లమందు కోసం చిలుకలు గుంపులు గుంపులుగా వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ఇలా వచ్చినవి నల్ల మందు తినడమే కాకుండా.. గింజలున్న కాయలను కొరికి పడేస్తున్నాయని అంటున్నారు. వీటిని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తునప్పటికీ ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట ఆకుపచ్చ రంగులో ఉండడం, చిలుకలు కూడా అదే రంగులో ఉండడం వల్ల వాటిని గుర్తించడం కష్టం అవుతోందంటున్నారు రైతులు. పంటను నాశనం చేసేందుకు చిలుకలే కాకుండా.. పశువులు కూడా వాటికి తోడవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు వినతి పత్రం అందజేసిన ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని పేర్కొన్నారు.
"ఒక గసగసాల మొక్క 30-35 గ్రాముల నల్లమందును ఉత్పత్తి చేస్తుంది. చిలుకలు నల్లమందుకు బాగా అలవాటు పడ్డాయి. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి చిలుకల గుంపు వచ్చి పడుతుంది. మందు తినే క్రమంలో కాయలు కూడా కింద రాలిపోతున్నాయి."
-గోపాల్ సాహు, గసగసాల రైతు
నల్ల మందుకు చిలుకలు బానిసగా మారాయని మరో రైతు అన్నారు. దీంతో ఒక్క రోజుకు సుమారు 30 నుంచి 40 సార్లు పంట మీద గుంపులుగా వచ్చి పడుతాయని పేర్కొన్నారు. కొన్ని అయితే గసగసాల మొగ్గలను విడదీసిన దాని నుంచి కారుతున్న మార్ఫిన్‌ను తింటాయని చెప్పారు. దీంతో పంట నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: