ETV Bharat / bharat

Omicron in India: దేశంలో 24కు చేరిన ఒమిక్రాన్​ కేసులు - omicron india news update

Omicron in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఇద్దరికి, రాజస్థాన్​లో ఇంకొరికి కొత్త వేరియంట్​ సోకినట్లు తేలింది. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 24కు చేరింది.

Omicron India Cases
Omicron India Cases
author img

By

Published : Dec 6, 2021, 8:13 PM IST

Omicron in India: భారత్​లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 10కి చేరింది.

రాజస్థాన్​లో 10కి

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో మరొకరికి ఒమిక్రాన్​ సోకింది. ఇటీవల జర్మనీ నుంచి జైపుర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. ఆ సంఖ్య సోమవారం నాటికి 10కి పెరిగింది. వీరంతా ఓ వివాహా వేడుకకు హాజరైనట్లు జైపుర్​ చీఫ్​ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నరోత్తమ్ శర్మ పేర్కొన్నారు. కొత్త వేరియంట్​ సోకిన కుటుంబానికి కాంటాక్ట్​ అయిన వారందరికీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

వివాహానికి హాజరైనవారు దిల్లీ నుంచి జైపుర్‌కు వెళ్లారని.. ఈ పరిణామాలపై దిల్లీ ప్రభుత్వానికి అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా జైపుర్‌లోని ఆర్‌యుహెచ్‌ఎస్​ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.

ఓ మహిళ ఉక్రెయిన్​ నుంచి షార్జా.. షార్జా నుంచి జైపుర్​లో పెళ్లికి హాజరైనట్లు తెలిసింది. ఆమెకు ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలింది. అయితే ఉక్రెయిన్​, షార్జా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్​ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

దేశంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలోనే ఆర్​టీపీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను క్వారంటైన్​కు తరలిస్తున్నాయి.

ఇదీ చూడండి: దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్​ కేసులు- రాజస్థాన్​లో 9 మందికి వైరస్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.