ETV Bharat / bharat

'ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేం.. మా దృష్టంతా సహాయక చర్యలపైనే' - రైల్వే సేఫ్టీ ఒడిశా

ఒడిశా దుర్ఘటనకు కారణాలు ఇప్పుడే చెప్పలేమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే కారణాలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలపై దృష్టిసారించినట్లు చెప్పారు.

odisha train accident
odisha train accident
author img

By

Published : Jun 3, 2023, 10:04 AM IST

Updated : Jun 3, 2023, 1:40 PM IST

ఒడిశా బాలేశ్వర్​లో రైళ్లు ఢీకొట్టిన ఘటనకు కారణాలను ఇప్పటికిప్పుడే చెప్పలేమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయని అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి.. ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తిగా దృష్టిసారించామని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

"ఆగ్నేయ రైల్వే సర్కిల్, రైల్వే సేఫ్టీ కమిషనర్​ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా అన్నది ఇప్పుడే చెప్పలేం. రైల్వే కమిషనర్ నివేదిక సమర్పించిన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలుస్తాయి."
-అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి

సహాయక చర్యల్లో పాల్గొంటున్న జాతీయ విపత్తు స్పందన దళాల(ఎన్​డీఆర్ఎఫ్)ను అశ్వినీ వైష్ణవ్ అభినందించారు. ఎన్​డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బోల్తా పడ్డ రైలు కోచ్​లపైకి ఎక్కి పరిస్థితిని పరిశీలించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం పరిస్థితిని సమీక్షించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆయన.. అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న స్థానికులు ప్రశంసించారు.

odisha train accident
ఘటనాస్థలిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
odisha train accident
ప్రమాద స్థలిని పరిశీలిస్తున్న రైల్వే మంత్రి

గ్యాస్ కటర్​లు, ఇతర పరికరాలను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టారు ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది. బోగీలను కత్తిరించి అందులో ఉన్న వారిని బయటకు తీస్తున్నారు. బోగీల కింద ఎవరైనా ఉంటారన్న అనుమానంతో... జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా దెబ్బతిన్న ఒక బోగీని కత్తిరించాల్సి ఉందని ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. దాన్ని కోసేసి.. మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీస్తామని చెప్పారు. ఒడిశా విపత్తు స్పందన బృందాలు, అగ్నిమాపక దళాలు సైతం రంగంలోకి దిగాయని అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిని.. సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

"రైలు బాగా దెబ్బతింది కాబట్టి సహాయక చర్యలు చాలా కష్టమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. పోస్టుమార్టం పరీక్షలు సైతం మొదలయ్యాయి. గుర్తించిన మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించిన తర్వాత బాడీలను అప్పగిస్తున్నాం. మృతదేహాలను గుర్తించలేకపోతే.. శవపరీక్షలు చేసి సంబంధిత కుటుంబాలకు అందిస్తాం."
-ఒడిశా సీఎస్ జెనా

Train Accident Odisha :
బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోచ్‌లు గూడ్సు రైలును ఢీకొట్టాయి. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఘటన పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 3, 2023, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.