ఓ 26 ఏళ్ల యువకుడు విధిరాతను ఎదిరించాడు. రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు, కాలు కోల్పోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పెయింటర్ కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. కుండలు, కుండీలు, సీసాలపై దేవుళ్లు, ఇతర చిత్రాలను గీసి తన కళానైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. మనసులో సంకల్పం దృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన ఈ యువ కళాకారుడి పేరు ప్రభాకర్ ప్రధాన్. పెయింటింగ్‌పై తనకున్న మక్కువ వల్లే దివ్యాంగుడిని అయినప్పటికీ రాణిస్తున్నానని అతుడు చెబుతున్నాడు.

ఈ యువ కళాకారుడు కుండలపై గీసిన పూరీ జగన్నాథుడి చిత్రాలు అధ్బుతంగా ఉన్నాయి. పూలు, సీనరీల చిత్రాలను కూడా సీసాలు,పాత్రలపై గీస్తాడు. తన ప్యాషన్‌తో భవిష్యతుల్లో మరిన్ని కళాకండాలు సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నాడు.

ఇదీ చదవండి: రన్‌వేపై గజరాజు హల్చల్- రెండు గంటల పాటు..