ETV Bharat / bharat

అరెస్టులపై స్టే విధించాలంటూ మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్‌ శర్మ - నుపుర్‌ శర్మ తాజా వార్తలు

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలం సృష్టించిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు.

నుపుర్‌ శర్మ
నుపుర్‌ శర్మ
author img

By

Published : Jul 19, 2022, 3:00 AM IST

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలం సృష్టించిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమెపై మొత్తంగా 9 కేసులు నమోదయ్యాయి. తన జీవితం ప్రమాదంలో పడిందని.. హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నట్లు దాఖలు చేసిన పిటిషన్‌లో నుపుర్‌ శర్మ పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున, దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన ఈ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలంటూ ఆ పిటిషన్‌లో కోరారు.

ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులను దిల్లీకి బదిలీ చేయాలంటూ గతంలోనూ పిటిషన్‌ వేయగా.. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నుపుర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90% ఓటింగ్.. దిల్లీకి బ్యాలెట్ బాక్సులు!

నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.