NTR 100Rupees Coin Huge Sale in Hyderabad : నందమూరి తారక రామారావు శత జయంతి స్మారకార్థం విడుదల చేసిన వంద రూపాయల నాణేనికి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌లోని సైఫాబాద్, చర్లపల్లి నాణెల ముద్రణ కేంద్రాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ప్రజలు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరి, ఎన్టీఆర్(NTR) వంద రూపాయల నాణెలను కొనుగోలు చేశారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జోరందుకున్నాయి.
NTR 100 rupees Coin Available in Online : మూడు రకాల నాణేలను తయారు చేసిన మింట్ కేంద్రం.. కనిష్ఠంగా 4 వేల 50 రూపాయల నుంచి గరిష్ఠంగా 4 వేల 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. తమ అభిమాన నటుడి స్మారకార్థం తయారు చేసిన ఈ నాణేన్ని కొనుగోలు చేయడం ఎంతో గర్వంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సైఫాబాద్, చర్లపల్లి మింట్ కేంద్రాలు ఎన్టీఆర్ అభిమానులతో సందడిగా మారాయి.
NTR 100 Rupees Coin : ఎన్టీఆర్ శతజయంతి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 నాణాన్ని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్ట్ 28న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఇతర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 నాణెం(100 Rupee Coin) ధరను మూడు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. రూ.4,850 చెక్క డబ్బాతో, రూ.4,380 ఫ్రూప్ ఫోల్డర్ ప్యాక్, రూ.4,050 యూఎస్సీ ఫోల్డర్ ప్యాక్‌గా నిర్ణయించింది. ఈ నాణం తయారికీ వెండి 50 శాతాన్ని, రాగిని 40 శాతాన్ని, జింక్, నికెల్లు 5 శాతాల మిశ్రమంగా రూపొందించారు. దీన్ని అభిమానులకి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. దేశ చరిత్రపై చెరగని ముద్రవేసిన ప్రముఖ వ్యక్తలకి నివాళులర్పిస్తూ.. నాణెంపై ముద్రిస్తారు. ఈ నాణెం కావాల్సిన వారు https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చని ముద్రణ అధికారులు తెలిపారు.
"ఇప్పటి వరకు ఏ కాయిన్ పదివేలుకు మించి కొనుగోలు అవ్వలేదు. మేము ఎన్టీఆర్ రూ.100 కాయిన్లు 12,000 నాణాలు ముద్రించాం. మరో 8,000 సిద్ధం అవుతున్నాయి. ఈ ఒక్కరోజులోనే పదివేలు నాణాలు విక్రయం జరిగేలా ప్రజల నుంచి స్పందన వస్తోంది. మేము ఇప్పటికి రెండు కౌంటర్లు తెరిచాం. ఉడెన్ బాక్స్లకి ఎక్కువగా డిమాండ్ ఉంది." - ముద్రణ అధికారి
వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించాం: పురందేశ్వరి