జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని చూస్తూ.. పరిస్థితుల్లో అణిగిమణిగి ఉండటం తప్ప ప్రజలకు వేరే దారి లేకుండా చేశారని ట్వీట్ చేశారు.
-
No words or pictures are enough to depict the pain, torment & upheaval inflicted upon J&K on this black day two years ago. When unbridled oppression is unleashed & gross injustice heaped there is no other choice but to resist to exist. pic.twitter.com/xjVW3By6cl
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">No words or pictures are enough to depict the pain, torment & upheaval inflicted upon J&K on this black day two years ago. When unbridled oppression is unleashed & gross injustice heaped there is no other choice but to resist to exist. pic.twitter.com/xjVW3By6cl
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2021No words or pictures are enough to depict the pain, torment & upheaval inflicted upon J&K on this black day two years ago. When unbridled oppression is unleashed & gross injustice heaped there is no other choice but to resist to exist. pic.twitter.com/xjVW3By6cl
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2021
"రెండు సంవత్సరాల క్రితం ఈరోజు చేసిన ప్రకటన వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలు ఎంతలా బాధపడ్డారో మాటల్లో చెప్పలేను. వారు అనుభవించిన బాధను ఫొటోలు చూసి వర్ణించలేం. అన్యాయం, తీవ్ర ఒత్తిడి నడుమ అణిగి ఉండటం తప్ప ప్రజలకు ఇంకో దారి లేకుండా చేశారు."
--మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు.
చీకటి రోజు..
'జమ్ముకశ్మీర్ చరిత్రలో ఆగస్టు 5 ఓ చీకటిరోజుగానే మిగిలిపోతుంది. ఈ నిర్ణయం జమ్ముప్రజలను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసింది' అని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఖుర్షీద్ ఆలమ్ అన్నారు.
గుప్కార్ కూటమి భేటీ..
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా తొలగించి రెండేళ్లయిన నేపథ్యంలో పీపుల్ అలియన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ) సభ్యులు భేటీ అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసం వద్ద సమావేశమై.. జమ్ముకశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు నేతలు పేర్కొన్నారు.
ఈ భేటీకి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎం వై తరిగామి, అవామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముజఫర్ షా సహా, ఇతర నేతలు హాజరయ్యారు.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయం తీసుకుంది కేంద్రం. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు వెల్లడించింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచే విమర్శిస్తున్నారు జమ్ముకశ్మీర్‌లోని పలువురు నేతలు.
ఇదీ చదవండి: