ETV Bharat / bharat

'ముంబయిలో ఉగ్రదాడులు చేస్తాం'.. ఎన్​ఐఏకు వార్నింగ్​.. జమ్ములో భారీ ఉగ్రకుట్ర భగ్నం - జమ్ములో భారీ ఉగ్రకుట్ర భగ్నం

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు వచ్చిన ఓ మెయిల్‌ కలకలం రేపుతోంది. ముంబయిలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. తాను తాలిబన్‌ సభ్యుడినంటూ దానిలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది సైన్యం.

threat calls to nia
threat calls to nia
author img

By

Published : Feb 3, 2023, 6:43 PM IST

ముంబయిలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు మెయిల్‌ చేశాడు. తాను తాలిబన్‌ సభ్యుడినంటూ దానిలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు.. ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులకు అందించారు. అనంతరం పోలీసులతో కలిసి సంయుక్త దర్యాప్తు ప్రారంభించింది ఎన్​ఐఏ. ఫోన్​ చేసిన ఐపీ అడ్రస్​ పాకిస్థాన్​లో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాలను అప్రమత్తం చేశారు.

అంతకుముందు కూడా ముంబయిలో పేలుళ్లకు పాల్పడతామంటూ చాలా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నగరంలో చాలాచోట్ల బాంబులు పెట్టామంటూ గతేడాది అక్టోబర్‌లో పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తర్వాత అది ఫేక్‌ కాల్‌ అని తేలింది. ఈ ఏడాది జనవరిలోనూ ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్‌ వచ్చింది. స్కూల్‌లో టైంబాంబు పెట్టామంటూ ఫోన్‌ రాగా అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఫేమస్‌ కావడం కోసమే తాను ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు పేర్కొనడం గమనార్హం.

arms recovery in kulgam
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధ సామగ్రి

భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన సైన్యం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఉగ్రకుట్రను సైన్యం భగ్నం చేసింది. నిఘా వర్గాల సమాచారంతో ఉగ్రకదలికలపై కన్నేసిన సైన్యం.. పోలీసులతో కలిసి ఆపరేషన్‌ నిర్వహించి ఆరుగురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వారిచ్చిన సమాచారంతో భారీగా ఆయుధాలు,మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇన్సాస్‌, ఏకే రైఫిళ్లు, పిస్టళ్లు, మేగజిన్లతో సహా గ్రనేడ్లు, మోర్టార్‌ షెల్స్, వాకీటాకీలను ఉగ్రవాదుల వద్ద గుర్తించినట్లు సైనికాధికారులు తెలిపారు. గ్రనేడ్లు విసిరి, కాల్పులు జరిపి కుల్గాంలో అరాచకం సృష్టించాలని వారంతా పథకం పన్నినట్లు వివరించారు.

ఇవీ చదవండి : జమ్ముకశ్మీర్​లో జోషీమఠ్ తరహా ఘటన.. ఇళ్లకు పగుళ్లు.. ఆందోళనలో స్థానికులు

'15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. పెళ్లికి చట్టబద్ధత ఇవ్వండి'.. ఇద్దరు అబ్బాయిల పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.