- పాత భవనంలో సభ్యుల కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉండేది: ప్రధాని
- ఆధునిక, సాంకేతికతలతో కూడిన కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది: ప్రధాని
- కొత్త భవనం ప్రపంచ దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది: ప్రధాని
- మన సంకల్పంతో మరింత శక్తిమంతం కావాలి: ప్రధాని
- 140 కోట్ల ప్రజల సంకల్పంతో కొత్త భవనానికి జీవం పోయాలి: ప్రధాని
'140 కోట్ల ప్రజల ఆశలే కొత్త పార్లమెంట్.. ప్రపంచ దేశాలకు ప్రేరణగా..' - కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించనున్న మోదీ
13:31 May 28
13:18 May 28
- స్వాతంత్ర్య తర్వాత భారత్ కొత్త యాత్ర ప్రారంభించింది: ప్రధాని
- ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్ అమృతోత్సవ వేళకు చేరుకుంది: ప్రధాని
- అమృతోత్సవ వేళ మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలి: ప్రధాని
- అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుంది: ప్రధాని
- ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలి: ప్రధాని
- ముక్త భారత్ కోసం నవీన పంథా కావాలి: ప్రధాని మోదీ
- కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుంది: ప్రధాని
- ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది: ప్రధాని
- బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది నయా పంథాలో వెళ్తున్నాం: ప్రధాని
- భారత్ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తోంది: ప్రధాని మోదీ
- కొత్త భవనం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు: ప్రధాని
- పార్లమెంటు భవనం అనేక సంస్కృతులకు సమ్మేళనంగా నిలిచింది: ప్రధాని
- భవనం ప్రతి అణువులో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావన ఉంటుంది: ప్రధాని
13:13 May 28
- సెంగోల్ గురించి మీడియాలో విస్తృత చర్చ జరిగింది: ప్రధాని
- సెంగోల్‌కు పూర్వ ప్రతిష్ఠ, గౌరవం తీసుకురావాలి: ప్రధాని
- సభ కార్యకలాపాల వేళ సెంగోల్ ప్రేరణగా నిలుస్తుంది: ప్రధాని
- ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్: ప్రధాని
- మన ప్రజాస్వామ్యమే మనకు ప్రేరణగా నిలుస్తుంది: ప్రధాని
- ప్రేరణ, సంకల్పానికి నిలయంగా కొత్త భవనం నిలుస్తుంది: ప్రధాని
- ఎవరైతే ఆగిపోతారో వారి అభివృద్ధి అక్కడే నిలిచిపోతుంది: ప్రధాని
- ఎవరైతే పురోగమనం సాగిస్తారో వారు పురోభివృద్ధి సాధిస్తారు: ప్రధాని
13:08 May 28
- ఈ పార్లమెంటు.. ప్రజాస్వామ్య దేవాలయం: ప్రధాని
- భారత్ అభివృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది: ప్రధాని
- చరిత్రాత్మక సమయంలో పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్టాపన జరిగింది: ప్రధాని
- కర్తవ్యం, సేవకు ప్రతీకగా సెంగోల్ నిలుస్తుంది: ప్రధాని మోదీ
- దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయి: ప్రధాని
- అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారు: ప్రధాని
- ఇది కేవలం భవనం కాదు.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింభం: ప్రధాని
- ప్రపంచానికి భారత దృఢ సంకల్పం సందేశం ఇస్తుంది: ప్రధాని మోదీ
- కొత్త భవనం స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా నిలుస్తుంది: ప్రధాని
- కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా నిలుస్తుంది: ప్రధాని
- పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఆదర్శంగా నిలుస్తుంది: ప్రధాని
- నవ భారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోంది: ప్రధాని
- ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోంది: ప్రధాని
- కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోంది: ప్రధాని
- భారత్ అభివృద్ధి.. ప్రపంచ పురోగమనంగా మారింది: ప్రధాని
12:58 May 28
- నూతన పార్లమెంటు భవనంలో పోస్టల్ స్టాంపు, రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
- రూ.75 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ప్రధాని మోదీ
12:53 May 28
- అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు సాక్షిగా నిలిచింది: ఓంబిర్లా
- ప్రధాని దృఢ సంకల్పంతో నూతన పార్లమెంటు భవనం సాకారమైంది: ఓంబిర్లా
- వేలాది కార్మికుల కృషితో రెండున్నరేళ్లలోనే భవనం పూర్తి: ఓంబిర్లా
- దేశ ప్రజల సంకల్పంతో కరోనా విపత్తు నుంచి గట్టెక్కాం: ఓంబిర్లా
12:45 May 28
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సందేశం చదివి వినిపించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్
12:35 May 28
- అమృతోత్సవ వేళ నిర్మించిన భవనం ప్రేరణగా నిలుస్తుంది: హరివంశ్
- నూతన భవనంలో దేశ ఉజ్వల భవిష్యత్తుకు నిర్ణయాలు జరుగుతాయి: హరివంశ్
- మున్ముందు ప్రపంచ యవనికపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: హరివంశ్
- ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా భారత్ మారుతుంది: హరివంశ్
12:30 May 28
- స్వాతంత్ర్య ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి ఘటనలకు సాక్షిగా నిలిచింది: హరివంశ్
- మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది: హరివంశ్
- ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం: హరివంశ్
- మున్ముందు సభ బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది: హరివంశ్
- మరింత మెరుగైన సభా కార్యకలాపాల కోసం కొత్త భవన నిర్మాణం: హరివంశ్
- రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలో నిర్మించడం హర్షణీయం: హరివంశ్
- దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా భవనం ఉంటుంది: హరివంశ్
- సాంస్కృతిక వైభవం, వాస్తు కళ జోడించి అద్భుతంగా నిర్మించారు: హరివంశ్
12:17 May 28
- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ప్రసంగం
- దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంటు భవనం ద్వారా నెరవేరుతాయి: హరివంశ్
- చరిత్రాత్మకమైన రోజు దేశ ప్రజలందరూ గర్వపడాలి: హరివంశ్
- గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచింది: హరివంశ్
- గత పార్లమెంటు భవనం అనేక చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది: హరివంశ్

12:13 May 28
కొత్త పార్లమెంట్ ప్రారంభ వేడుకల్లో రెండో భాగం మొదలైంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు లోక్‌సభకు విచ్చేశారు. జాతీయ గీతంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రసంగిస్తున్నారు.
08:14 May 28
- నూతన పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులకు సన్మానం
- కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేసిన ప్రధాని మోదీ
- నూతన పార్లమెంటు భవన ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు
- కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు, ముఖ్య నేతలు
08:03 May 28
- నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

- కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేసిన ప్రధాని
07:54 May 28
- నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం
- లోక్‌సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ ప్రతిష్ఠించిన ప్రధాని
- సెంగోల్ ప్రతిష్ఠాపించి జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
07:44 May 28
- నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం
- పార్లమెంటు భవన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
- ప్రధానితో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలుత గణపతి హోమం
- పూజ తర్వాత సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం
- అనంతరం ప్రధాని మోదీకి సెంగోల్ అందజేసిన పూజారులు
07:31 May 28
నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడే జరుగుతున్న యాగంలో ఆయన పాల్గొన్నారు.
06:35 May 28
- రెండు భాగాలుగా నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం
- ఉదయం 7.15 నిమిషాలకు కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
- ఉదయం 7.30 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం
- దాదాపు గంటపాటు జరగనున్న పూజా కార్యక్రమాలు
- ఉదయం 8.30 నిమిషాలకు లోక్‌సభ ఛాంబర్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
- ఉదయం 9 నిమిషాలకు లోక్‌సభ స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ ప్రతిష్ఠాపన
- ఉదయం 9.30 నిమిషాలకు లోక్‌సభలో ప్రార్థనా కార్యక్రమాలు
- ఉదయం 11.30 నిమిషాలకు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రముఖులు, అతిథులు రాక
- మధ్యాహ్నం 12 గంటలకు జాతీయగీతంతో వేడుకలు తిరిగి ప్రారంభం
- మధ్యాహ్నం 12.10 నిమిషాలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ప్రసంగం
- మధ్యాహ్నం 12.17 నిమిషాలకు పార్లమెంట్ చరిత్రపై రెండు లఘుచిత్రాల ప్రదర్శన
- మధ్యాహ్నం 12.38 నిమిషాలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం
- మధ్యాహ్నం ఒంటి గంటకు 75 రూపాయల నాణేం, స్టాంపు విడుదల
- మధ్యాహ్నం 1.30 నిమిషాలకు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
- మధ్యాహ్నం 2 గంటలకు ముగియనున్న వేడుకలు
06:13 May 28
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభ వేడుకలు..సెంగోల్‌ను ప్రతిష్ఠించిన మోదీ
New Parliament Building Inauguration : దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున అధునాతన హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిల్లీ మొత్తాన్ని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి.. ఆదివారం ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్ నుంచి తీసుకువచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్న శిలాకృతులు.. ఇలా దేశంలో భిన్న సంస్కృతుల మేళవింపుగా భవనాన్ని తీర్చిదిద్దారు. బ్రిటిష్ పాలకుల నుంచి అధికారం బదలాయింపునకు చిహ్నంగా తొలి ప్రధాని నెహ్రూ స్వీకరించిన చారిత్రక ఉత్సవ రాజదండం 'సెంగోల్'ను కొత్త లోక్‌సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో పెడతారు. ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన కొత్త భవనంలో భారీస్థాయి 'కాన్‌స్టిట్యూషన్ హాల్', ఎంపీల కోసం ఒక లాంజ్, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. త్రికోణాకారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.
నాగ్‌పుర్ టేకు.. అజ్‌మేర్ ఎర్ర గ్రానైట్
నూతన భవనంలో వాడిన టేకును మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి తెప్పించారు. రాజస్థాన్‌లోని సర్‌మధుర నుంచి ఎర్ర చలువరాయిని తీసుకువచ్చారు. తెల్ల చలువరాయిని రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి, కేసరియా ఆకుపచ్చరాయిని ఉదయ్‌పుర్ నుంచి, ఎర్ర గ్రానైట్‌ను అజ్‌మేర్ సమీపంలోని లఖా నుంచి, ఫర్నిచర్‌ను ముంబయి నుంచి తెప్పించారు. అశోకచిహ్నం కోసం సామగ్రిని ఔరంగాబాద్ నుంచి, ఉభయసభల్లో భారీ గోడలపై అశోక చక్రం రూపొందించడానికి ఇందౌర్ నుంచి సామగ్రి తీసుకువచ్చారు.