ETV Bharat / bharat

అభివృద్ధి బాటలో జమ్ముకశ్మీర్​- భారీగా పెట్టుబడులు! - కొత్త పారశ్రామిక విధానం

జమ్ముకశ్మీర్​లోని ఆ పట్టణాల్లో కొంతకాలం కిందటి వరకు తుపాకులు రాజ్యమేలాయి. ముష్కర దాడులు, ఎన్‌కౌంటర్‌ వార్తల్లో వాటి పేర్లు మార్మోగేవి. అయితే కొత్త పారిశ్రామిక విధానంతో పరిస్థితులు మారుతున్నాయి. పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. వాణిజ్యం, ప్రాజెక్టులు, టర్నోవర్‌లు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Investment Queue in Jammu and Kashmir
అభివృద్ధి బాటలో జమ్ముకశ్మీర్​
author img

By

Published : Aug 9, 2021, 2:25 PM IST

ఏదైనా కాల్‌సెంటర్‌ నుంచి మీకు ఫోన్‌ వస్తే అది ఇక బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్‌ వంటి ఐటీ హబ్‌ల నుంచి వచ్చింది అయి ఉండకపోవచ్చు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి అడ్డాలుగా ఉన్న బందిపొర, కుప్వారా వంటి పట్టణాల నుంచి రావొచ్చు. గత కాలపు రక్తపు మరకలు చెరిపేసుకొని.. అభివృద్ధి, వాణిజ్యంలో ఈ ప్రాంతాలు ఇప్పుడు ముందడుగు వేస్తున్నాయి. కొత్త పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తూ నయా సొబగులను సంతరించుకుంటున్నాయి. కొంతకాలం కిందటి వరకూ అక్కడ తుపాకులు రాజ్యమేలాయి. ముష్కర దాడులు, ఎన్‌కౌంటర్‌ వార్తల్లో ఆ పట్టణాల పేర్లు మార్మోగేవి.

ఇప్పుడు పరిస్థితి మారుతోంది. క్రమంగా ఎదురుకాల్పులు, ఉగ్రవాద దాడులు అనే మాటల స్థానంలో వాణిజ్యం, ప్రాజెక్టులు, టర్నోవర్‌లు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది నాలుగు నెలల కిందట తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం (ఎన్‌ఐపీ) ఫలితమే. దీనివల్ల ఇప్పటివరకూ రూ.23వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో జమ్మూకు రూ.12వేల కోట్లు, కశ్మీర్‌కు రూ.11వేల కోట్లు దక్కాయి. "ఇది ప్రారంభం మాత్రమే. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రూ.50వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం" అని జమ్ముకశ్మీర్‌ అధికార వర్గాలు తెలిపాయి.

కాల్‌ సెంటర్ల జోరు..

జమ్ము-కశ్మీర్‌లోని ప్రతి జిల్లాలోనూ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసే కసరత్తు సాగుతోంది. "ఇక్కడ ఐటీకి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాం. నిజానికి అనేక పెద్ద కంపెనీలు దీనిపై ఆసక్తి చూపడం వల్లే మేం ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. బారాముల్లా, జమ్ములో యువత కోసం ఇప్పటికే హైటెక్‌ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్కడ.. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) వంటి అధునాతన అంశాలపై శిక్షణ ఇస్తున్నాం" అని జమ్ముకశ్మీర్‌ పాలన యంత్రాంగంలోని ఓ కీలక అధికారి తెలిపారు.

పెట్టుబడిదారుల నుంచి నిత్యం 3-4 ప్రతిపాదనలు వస్తున్నాయని అధికారులు చెప్పారు. వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొన్నింటిని తోసిపుచ్చాల్సి వస్తోందని తెలిపారు.

"దేశీయ పెట్టుబడిదారుల నుంచే ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటిలో అధిక భాగం ముంబయి వ్యాపారవేత్తల నుంచి అందుతున్నాయి. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఐరోపా పెట్టుబడిదారుల నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్‌ రంగాలపై పెట్టుబడిదారులు దృష్టి పెడుతున్నారు. ఇక్కడి ప్రత్యేక వాతావరణం, భౌగోళిక పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తదుపరి విడత పెట్టుబడుల ఆకర్షణ కసరత్తులో దీనిపై ఎక్కువగా దృష్టి పెడతాం. ఎక్కువ మంది వ్యాపారవేత్తలు పండ్ల పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆపిళ్లు, ఆప్రికాట్, ప్లమ్, చెర్రీ, బాదం తదితరాలపై దృష్టి ఎక్కువగా ఉంటోంది. ఇందుకు అనుగుణంగా భారీగా పండ్ల తోటల పెంపకం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రంగంలో ప్రయోగాలు, పరిశోధనలూ పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి" అని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: పెట్టుబడి సాయం విడుదల- రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.