ETV Bharat / bharat

NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా! - latest job news in telugu

NCL Apprentice Jobs 2023 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. నార్తర్న్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​ 1140 అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

NCL Recruitment 2023
NCL Apprentice Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 11:11 AM IST

NCL Apprentice Jobs 2023 : మినీ రత్న హోదా గల ప్రభుత్వ రంగ సంస్థ.. నార్తర్న్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​ (NCL) 1140 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిట్టర్​ - 543 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్​ - 370 పోస్టులు
  • వెల్డర్​ - 155 పోస్టులు
  • మోటార్ మెకానిక్​ - 47
  • ఎలక్ట్రానిక్ మెకానిక్​ - 13 పోస్టులు
  • ఆటో ఎలక్ట్రీషియన్​ - 12
  • మొత్తం అప్రెంటీస్ పోస్టులు​ - 1140

విద్యార్హతలు
NCL Apprentice Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలో పదో తరగతి లేదా 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు అనుగుణంగా (ఎలక్ట్రానిక్​​ మెకానిక్​/ ఎలక్ట్రీషియన్​/ ఫిట్టర్​/ వెల్డర్​/ మోటార్​ మెకానిక్​ / ఆటో ఎలక్ట్రీషియన్​ ) ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా NCVT/ SCVT ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి
NCL Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్లు నుంచి 26 ఏళ్లు మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ
NCL Apprentice Selection Process : 10వ తరగతి + ఐటీఐ ట్రేడ్ టెస్ట్​లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను.. అప్రెంటీస్​ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.

ట్రైనింగ్ - స్టైపెండ్​
NCL Apprentice Training : ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ అందిస్తారు. వెల్డర్ పోస్టులకు మాత్రం రూ.7,700 స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు చేయండి ఇలా!
NCL Apprentice Online Apply Process : ఆసక్తి గల అభ్యర్థులు అన్​లైన్​లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా ఎన్​సీఎల్​ అధికారిక వెబ్​సైట్​ https://www.nclcil.in/ ఓపెన్ చేయాలి.
  • NCL Apprentice Recruitment 2023 లింక్​పై క్లిక్​ చేసి, ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలి.
  • ముఖ్యమైన విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్​ చేయాలి.
  • అన్ని వివరాలను ఒకసారి చెక్​ చేసుకుని.. అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్ తీసుకుని, భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NCL Apprentice Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 5
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 15

ESIC Paramedical Recruitment 2023 : ESICలో 1038 ఉద్యోగాలు.. తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్​లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. క్వాలిఫికేషన్​ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.