ETV Bharat / bharat

Narendra Modi ISRO : 'చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి 'శివశక్తి' పేరు.. అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23' - నరేంద్ర మోదీ విదేశీ పర్యటన

Narendra Modi ISRO : చంద్రుడిపై చంద్రయాన్​-3 ల్యాండింగ్​ అయిన ప్రదేశానికి 'శివశక్తి'గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. చంద్రయాన్​-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్​గా పిలవనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు.

Narendra Modi ISRO
Narendra Modi ISRO
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 8:44 AM IST

Updated : Aug 26, 2023, 9:32 AM IST

Narendra Modi ISRO : జాబిల్లిపై చంద్రయాన్​-3 దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి' అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2019లో చంద్రయాన్​-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్​గా పిలవనున్నట్లు మోదీ అన్నారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ఆగస్టు 23ను అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. చంద్రయాన్‌-3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు.

  • #WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I

    — ANI (@ANI) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మన దేశ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం : మోదీ
PM Modi Visits ISRO : "ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్‌ సృష్టించింది. ఇప్పుడు చంద్రుడిపై భారత్​ ఉంది. మన దేశ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసి చూపించింది" అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

  • VIDEO | "India is on the Moon. We have our national pride placed on the Moon," says PM Modi as he addresses ISRO scientists in Bengaluru on the successful landing of Chandrayaan-3 on Moon's surface. pic.twitter.com/rX5Rcatbh7

    — Press Trust of India (@PTI_News) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా మన జెండా..'
Modi Visit To Bangalore : "ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతికత వైపు ప్రపంచం చూస్తోంది. చంద్రయాన్‌-3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణం. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. చంద్రయాన్‌-2 వైఫల్యంతో మనం వెనకడుగు వేయలేదు. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్‌-3 విజయం సాధించాం. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోంది" అని మోదీ తెలిపారు.

  • VIDEO |"I wanted to meet you all as soon as I landed in India," says PM Modi as he gets emotional while addressing ISRO scientists in Bengaluru on the successful landing of Chandrayaan-3 on Moon's surface.

    (Source: Third Party) pic.twitter.com/FsLCQ2MyeP

Chandrayaan 3 : జాబిల్లిపై 14 రోజులపాటు విక్రమ్, ప్రగ్యాన్​.. అక్కడ అసలు ఏం చేస్తాయి?

ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం
Modi Visit ISRO : "'మేకిన్‌ ఇండియా' ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదాం. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలి. తుపానులను అంచనా వేయడం వల్ల మరింత నైపుణ్యం సాధించాలి. వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలి" అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

  • #WATCH | Bengaluru: I wanted to meet you as soon as possible and salute you…salute your efforts...": PM Modi gets emotional while addressing the ISRO scientists pic.twitter.com/R2BsyyPiNc

మోదీకి ప్రయోగం తీరును వివరించిన సోమనాథ్​
Modi Visit To ISRO : చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు.. విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఇస్రో కేంద్రానికి వెళ్లి.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు.

  • VIDEO | ISRO chief S Somanath briefs PM Modi about the details of rover Pragyaan and lander Vikram during their interaction at ISRO headquarters in Bengaluru. pic.twitter.com/kJbw1shlHB

Last Updated : Aug 26, 2023, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.