ETV Bharat / bharat

'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్'.. రెండో పెళ్లి చేసుకున్న వారికి స్పెషల్ డిస్కౌంట్! - బిహార్ సెకండ్ వైఫ్ రెస్టారెంట్ పట్నా

బిహార్​కు చెందిన ఓ వ్యక్తి తన హోటల్​కు వినూత్నంగా 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరు పెట్టాడు. రెండో వివాహం చేసుకున్నవారు తన హోటల్​కు వస్తే ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇలా ప్రత్యేక పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు ఆ హోటల్ యజమాని.

My second wife restaurant
My second wife restaurant
author img

By

Published : Dec 25, 2022, 3:44 PM IST

'పేరులో ఏముంది?' అని షేక్స్​పియర్ అంటుంటారు. కానీ, పేరే అన్నింటికీ మూలం. మనుషులతో పాటు రెస్టారెంట్లకూ ఈ విషయం వర్తిస్తుంది. కొత్తగా రెస్టారెంట్ ప్రారంభించాలంటే టేస్టీ వంటకాలతో పాటు పేరు కూడా ముఖ్యమే. బిహార్​కు చెందిన రంజిత్ కుమార్ సైతం ఇలాగే వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్​కు 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరు పెట్టారు. అంటే 'నా రెండో భార్య అని అర్థం'. అంతే కాదు, పేరుకు తగ్గట్టు.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్​కు వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు.

ఇలాంటి పేరు ఎందుకంటే?
పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో ఈ హోటల్ నెలకొల్పాడు రంజిత్. రోడ్డుపై వెళ్తున్నవారు పేరు చూసి హోటల్​కు వస్తున్నారు. ప్రస్తుతం హోటల్​లో టీ, బర్గర్లు, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నట్లు రంజిత్ తెలిపాడు. వేసవి కాలంలో ఐస్​క్రీమ్​లు సైతం విక్రయిస్తానని చెబుతున్నాడు. రెస్టారెంట్​కు 'మై సెకండ్ వైఫ్' అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు రంజిత్. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని అంటున్నాడు. 'ఇంటి వద్ద నాకు భార్య ఉంది. ఇక్కడ మాత్రం రెస్టారెంట్ నా భార్య వంటిది. ఇవి రెండంటే నాకు ఇష్టం' అని చెబుతున్నాడు. హోటల్​కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని రంజిత్ చెబుతున్నారు.

My second wife restaurant
మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్

"నా భార్య సుష్మ కుమారి కూడా ఇలాంటి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించింది. ఇద్దరు భార్యలు ఉండటం ఏంటని అడిగింది. కానీ, ఈ విషయంలో నా స్నేహితులు నా అభిప్రాయానికే ఓకే చెప్పారు. స్నేహితులు మరికొన్ని ఆకర్షణీయమైన పేర్లు సూచించారు. కానీ నేను ఇదే ఖరారు చేశా. దీంతో అక్టోబర్ నెలలో 'మై సెకండ్ వైఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్' ప్రారంభించా."
-రంజిత్ కుమార్, 'మై సెకండ్ వైఫ్' యజమాని

రెండోసారి వివాహం చేసుకున్నవారికి ఈ హోటల్​లో డిస్కౌంట్ సైతం లభిస్తుంది. రెండో వివాహం చేసుకున్న మహిళలైనా, పురుషులైనా.. వారికి తన హోటల్​లో డిస్కౌంట్ ఇస్తానని రంజిత్ చెబుతున్నాడు. 'సాధారణంగా కస్టమర్లలో ఎవరికి రెండో వివాహం జరిగిందో తెలుసుకోవడం కష్టమే. కానీ, ఎవరైనా రెండు వివాహాలు చేసుకున్నట్లు తెలిస్తే మాత్రం కచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా' అని రంజిత్ తెలిపాడు.

My second wife restaurant
రంజిత్ కుమార్, హోటల్ యజమాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.