ETV Bharat / bharat

పేరు మార్చుకొని మోసం.. బాలికపై యువకుడు అత్యాచారం.. మతం మారాలంటూ..

ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు.. హిందూ బాలికను మోసం చేశాడు. ఆమెపై పలుమర్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడి గురించి బాలికకు నిజం తెలియగానే అతడిని దూరం పెట్టింది. అయితే, ఆ వ్యక్తి బాలికను వేధించడం ప్రారంభించాడు. మతం మారమంటూ ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. మరో పక్క తొమ్మిది నెలల కింద అత్యాచారానికి గురైన బాలిక మగబిడ్డకు జన్మినిచ్చింది.

love jihad in uttarakhand
ఉత్తరాఖండ్‌లో లవ్ జిహాద్ ఘటన
author img

By

Published : Dec 14, 2022, 6:16 PM IST

Updated : Dec 14, 2022, 7:30 PM IST

ఉత్తరాఖండ్​లో లవ్​జిహద్​ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు.. హిందూ బాలికను మోసం చేశాడు. ఆమెపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతం మారాల్సిందిగా వేదింపులకు గురి చేస్తున్నాడు. అందుకు ఆమె తిరస్కరించగా.. నిందితుడు దాడికి పాల్పడుతున్నాడు. దీంతో సదరు బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. షకీబ్ సైఫీ అనే వ్యక్తి నైనిటాల్ జిల్లా రాంనగర్​లో నివసిస్తున్నాడు. మొహల్లా బంగాఘోర్ ప్రాంతానికి చెందిన ఓ హిందూ బాలికతో అతడు పరిచయం పెంచుకున్నాడు. తాను హిందువునేనంటూ బాలికతో చెప్పాడు ఆ యువకుడు. తన పేరు శివ ఠాకూర్​ అని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులకు వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. శారీరకంగానూ ఇరువురు దగ్గరయ్యారు. అయితే, కొద్దిరోజుల తర్వాత నిజం తెలుసుకున్న బాలిక షకీబ్​ను దూరం పెట్టింది. అనంతరం అతడు బాలికను వేధించడం ప్రారంభించాడు. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

షకీబ్ వేధింపులు పెరగడం వల్ల.. యువకుడిపై బాధిత బాలిక పోలీసులను ఫిర్యాదు చేసింది. "షకీబ్ సైఫీ నా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. నన్ను చంపుతానని బెదిరించడమే కాకుండా, నా సోదరినీ వెంబడిస్తున్నాడు" అని బాలిక ఆరోపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు షకీబ్‌తో పాటు సబా, యూనస్, రహీలా, గజాలపై కూడా కేసు నమోదు చేశారు. విచారణ ముమ్మరంగా జరుగుతోందని వారు వెల్లడించారు.

బిడ్డకు జన్మనిచ్చిన అత్యాచార బాలిక..
13 ఏళ్ల అత్యాచార బాధితురాలు మగబిడ్డకు జన్మినిచ్చింది. తొమ్మిది నెలల క్రితం ఓ వ్యక్తి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా మంగళవారం బాధితురాలు ప్రసవించింది. అయితే, ఆ బిడ్డను తీసుకెళ్లేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లా చర్వా పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. శివ మూరత్​ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే ఆమె తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు బాలిక భయపడి ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ బాధిత బాలిక కొద్ది రోజులకు గర్భం దాల్చింది. తద్వారా అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఆగస్టులో శివను పోలీసులు అరెస్ట్​ చేశారు.

కాగా, బాలిక అబార్షన్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఘటనపై విచారణ చేసిన కోర్టు.. అక్టోబర్ 15న తీర్పు వెల్లడించింది. బాలికకు అబార్షన్​ చేయాల్సిందిగా జిల్లా ఆసుపత్రి వైద్యులను ఆదేశించింది. అబార్షన్​కు ఇది సమయం కాదని భావించిన వైద్యులు.. అందుకు నిరాకరించారు. దీంతో నవంబర్​ 15న బాలికను వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని మరోసారి కోర్ట్​ ఆదేశాలిచ్చింది. మంగళవారం వైద్యుల సమక్షంలోనే బాలిక ప్రసవించింది. కాగా శిశువును తీసుకెళ్లేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

Last Updated : Dec 14, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.