ETV Bharat / bharat

పెళ్లి చేసుకుంటానని మైనర్​పై రేప్​.. గర్భం దాల్చాక హత్య.. చెట్టుకు వేలాడదీసి.. - maharastra news

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. బాలిక గర్భం దాల్చిందని తెలిశాక.. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మైనర్​ను గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి హత్య చేసి.. చెట్టుకు వేలాడదీసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లోని దుమ్కా జిల్లాలో జరిగింది.

murder-after-sexual-abuse-with-minor-in-dumka-jharkhand

author img

By

Published : Sep 4, 2022, 8:37 AM IST

Updated : Sep 4, 2022, 9:10 AM IST

ఝార్ఖండ్​లోని దుమ్కా జిల్లాలో మైనర్​పై పెట్రోల్​ పోసి తగలబెట్టిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మైనర్​పై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత బాలికను గ్రామ శివార్లకు తీసుకెళ్లి హత్య చేసి.. అక్కడే ఉన్న చెట్టుకు మృతదేహాన్ని వేలాడి దీసి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని రాణీశ్వర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గ్రామానికి చెందిన బాధితురాలు.. కొద్దిరోజుల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు అర్మాన్​ అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అర్మాన్​. దీంతో మైనర్​ గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న అతడు.. బాలికను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే బాధితురాలి గ్రామానికి వెళ్లి.. ఆమెను బయటకు రమ్మని గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. అక్కడ హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఉన్న చెట్టుకు వేలాడి దీశాడు.

మరుసటి రోజు చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మైనర్​ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ నివేదికలో ఆమెది హత్య అని తేలింది. అయితే తమకు అర్మాన్​పైనే అనుమానంగా ఉందని పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తమదైన శైలిలో విచారణ జరపగా.. చేసిన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు అరెస్ట్​ చేసి అతడ్ని జైలుకు తరలించారు.

ఉరేసుకుని కుమారుడు మృతి.. బావిలోకి దూకి తల్లి మరణం
మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ 26 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలుసుకున్న అతడి తల్లి వెంటనే బావిలోకి దూకి తనువు చాలించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కండ్రే భురే గ్రామానికి చెందిన శైలేశ్​ పాటిల్​(26) గురువారం మధ్యాహ్నం తన ఇంటి సమీపంలో ఉరివేసుకుని చనిపోయాడు. కాసేపటి తర్వాత అతడ్ని కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే కిందకి దించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన శైలేశ్​ తల్లి కల్పనా పాటిల్​(40) అక్కడే ఉన్న బావిలోకి దూకి చనిపోయింది. అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకునేసరికి మృతదేహాలకు వారి కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇవీ చదవండి: దిల్లీకి నితీశ్​.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా విస్తృత పర్యటన

అధికారుల నిర్లక్ష్యం.. పదుల సంఖ్యలో పక్షుల మృత్యువాత.. వీడియో వైరల్​

Last Updated : Sep 4, 2022, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.