ETV Bharat / bharat

అదో మామూలు బ్యాగ్ అనుకున్నారు.. ఓపెన్ చేస్తే రూ.24 కోట్లు... - డ్రగ్స్ సీజ్ ముంబయి

MUMBAI DRUGS NCB: ముంబయిలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. రూ.24 కోట్ల విలువైన హెరాయిన్​ను ఎన్​సీబీ అధికారులు సీజ్ చేశారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్​లో హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని తెలిపారు.

mumbai airport drugs
mumbai airport drugs
author img

By

Published : Apr 14, 2022, 1:28 PM IST

MUMBAI DRUGS NCB: ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి 3.98 కేజీల హెరాయిన్​ను ఎన్​సీబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

మత్తుపదార్థాల స్మగ్లింగ్​పై పక్కా సమాచారం తమకు అందిందని అధికారులు తెలిపారు. ఎన్​సీబీ ముంబయి జోన్ అధికారుల బృందం రంగంలోకి దిగి.. నిందితుడిని పట్టుకుందని వెల్లడించారు. జొహనస్​బర్గ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎరుపు రంగు ట్రాలీ బ్యాగ్​ను తీసుకొచ్చాడని వివరించారు. అందులోనే మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పారు. బ్యాగులో నాలుగు హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని తెలిపారు.

ఇదీ చదవండి: పెంపుడు కుక్క మొరిగిందని గొడవ.. యజమానిపై కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.