ETV Bharat / bharat

Jinnah House: ఇల్లు విషయంలో నేటికీ తీరని జిన్నా కోరిక!

author img

By

Published : Aug 31, 2021, 7:40 AM IST

ముంబయిలోని తన ఇల్లు అమ్మకం విషయంలో రూ.3 లక్షల కోసం చూసుకున్న మహమ్మద్ అలీ జిన్నా(Muhammad Ali Jinnah) కోరిక నేటికీ తీరలేదు. మలబార్‌ హిల్‌ సౌత్‌కోర్టు బంగ్లాకు రూ.17 లక్షల బేరం వస్తే.. 20 లక్షలు కావాలంటూ పట్టుబట్టారు జిన్నా! చివరకు తానెంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని జిన్నా అలాగే వదిలేసి వెళ్లక తప్పలేదు.

jinnha house
జిన్నా ఇల్లు

దేశ విభజన విషయంలో పట్టుబట్టి సఫలమైన మహమ్మద్‌ అలీ జిన్నా(Muhammad Ali Jinnah).. తన ఇల్లు(Jinnah House) అమ్మకం విషయంలో మాత్రం విఫలమయ్యారు. ముంబయిలో అరేబియా సముద్రానికి అభిముఖంగా.. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మలబార్‌ హిల్‌ సౌత్‌కోర్టు బంగ్లాకు రూ.17 లక్షల బేరం వస్తే.. 20 లక్షలు కావాలంటూ పట్టుబట్టారు జిన్నా! మూడు లక్షల కోసం చూసుకున్న జిన్నా కోరిక నేటికీ తీరలేదు. మంచి లాయర్‌గా పేరుగాంచిన జిన్నా.. 1937-39 మధ్య ఈ బంగ్లాను కట్టించుకున్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2లక్షలైంది. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలంగా నిర్మించిన ఈ ఇంట్లోకి 1939లో మారారు జిన్నా! ఆ మరుసటి ఏడాదే 1940లో పాకిస్థాన్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో.. జిన్నా అయిష్టంగానే అయినా బంగ్లాను అమ్మకానికి పెట్టారు.

jinnha house
మలబార్‌ హిల్‌ సౌత్‌కోర్టు బంగ్లా

తగ్గేది లేదంటూ మొండికేశారు..

తొలుత ఈ బంగ్లాను చూసిన వారిలో హైదరాబాద్‌ రాజు నిజాం ఒకరు. రూ.8.50లక్షలకిస్తే తీసుకుంటానంటూ జిన్నాతో బేరమాడారు. ఆ అంకె చూడగానే ఖిన్నుడైన జిన్నా ససేమిరా అన్నారు. ఒకవంక విభజన ఖాయమై పోతున్నా బంగ్లా మాత్రం అమ్ముడుపోకపోవటం జిన్నాకు చింతగా మారింది. 1947 మేలో.. ఎఎం తరైని అసోసియేట్స్​ అనే కంపెనీ రూ.17 లక్షలకు తీసుకోవటానికి ముందుకొచ్చింది. కానీ జిన్నా.. రూ.20 లక్షలకు ఒక్క పైసా తగ్గేది లేదంటూ మొండికేశారు. దీంతో ఆ బేరం పోయింది. చివరకు... తమ రాయబార కార్యాలయం కోసం కొనుగోలు చేయాలంటూ ఇరాన్‌నూ కోరారు. అదీ పనిచేయలేదు. ఇంతలో విభజన ముహూర్తం రానే వచ్చింది. తానెంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని జిన్నా అలాగే వదిలేసి వెళ్ళక తప్పలేదు.

మళ్లీ ఎన్నడూ జిన్నా రాలేదు..

స్వాతంత్య్రానంతరం ఈ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనుకున్నారంతా! కానీ.. పాక్‌లో అప్పటి భారత రాయబారి ప్రకాశ, ప్రధాని నెహ్రూతో జిన్నా స్నేహం కారణంగా ప్రభుత్వం ముందుకు కదలలేదు. తానెన్నటికైనా ముంబయి వచ్చి సౌత్‌కోర్టులో ఉంటానంటూ ప్రకాశ ద్వారా జిన్నా సందేశాలు పంపేవారు. కానీ మళ్లీ ఎన్నడూ జిన్నా రాలేదు. 1980ల దాకా ఈ ఇంటిని బ్రిటిష్‌ హైకమిషన్‌ కార్యాలయంగా వాడారు. తమ రాయబార కార్యాలయంగా వాడుకోవటం కోసం తమకు అమ్మాలని పాకిస్థాన్‌ కోరింది. 2007లో జిన్నా కూతురు దీనావాడియా ఈ ఇల్లు తనకే చెందుతుందంటూ ముంబయి హైకోర్టులో కేసు వేశారు. 2017లో ఆమె చనిపోయారు. తర్వాత ఆమె కుమారుడు నస్లీవాడియా పిటిషన్‌లో భాగమవటంతో కేసు నడుస్తోంది.

ఇదీ చూడండి: అదే చివరకు దేశ విభజనకూ దారి తీసింది!

ఇదీ చూడండి: జాతీయోద్యమ రణ స్ఫూర్తే.. అమృతోత్సవ శుభసంకల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.