ETV Bharat / bharat

వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..! - వానల కోసం పూజలు

కరువు నుంచి గట్టెక్కించాలని వరుణుడిని వేడుకుంటూ(rituals for rain) బాలికలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మధ్యప్రదేశ్​ దమోహ్​ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై గ్రామం నుంచి ఏ ఒక్కరు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. సమాచారం అందుకున్న జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్​ విచారణకు ఆదేశించింది.

Minor girls paraded naked in village
వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగింపు
author img

By

Published : Sep 6, 2021, 10:42 PM IST

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఓవైపు దూసుకెళుతుంటే.. మరోవైపు గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మధ్యప్రదేశ్​ దమోహ్​ జిల్లాలోని ఓ గ్రామంలో వానలు పడాలని(rituals for rain) ఆరుగురు బాలికలను నగ్నంగా ఊరేగించారు. జబెరా పోలీస్​ స్టేషన్​ పరిధి, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్​(ఎన్​సీపీసీఆర్​) చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జిల్లా పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. త్వరలోనే తమ నివేదికను ఎన్​సీపీసీఆర్​కు సమర్పిస్తామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.

"స్థానిక సంప్రదాయం ప్రకారం వానలు కురవాలని కొంతమంది బాలికలను గ్రామంలో నగ్నంగా తిప్పినట్లు మాకు సమాచారం అందింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టాం. నగ్నంగా వెళ్లాలని బాలికలను ఒత్తిడి చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. అలా చేయటం ద్వారా వర్షాలు పడతాయని ఆ గ్రామస్థులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే.. ఒక కర్రకు కప్పను కట్టి.. కర్రను నగ్నంగా ఉన్న బాలికలు మోస్తూ గ్రామంలో తిరుగుతారు. వారితో పాటు కొందరు మహిళలు తిరుగుతూ వాన దేవుడి కోసం భజనలు చేస్తారు."

- డీఆర్​ తెనివార్​, దమోహ్​ జిల్లా ఎస్పీ.

ఈ సంఘటనలో బాలికల తల్లిదండ్రులు సైతం ఉన్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్​ ఎస్​ క్రిష్ణ చైతన్య. ఇలాంటి వాటిపై వారికి పూర్తి అవగాహన ఉన్నట్లు తెలిపారు. ఈ పూజలపై గ్రామం నుంచి ఎవరూ ఫిర్యాదు చేయాలేదని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో జిల్లా అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారని, అలాంటివి ఫలితాలు ఇవ్వవని చెబుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఓ వీడియో సుమారు 5 ఏళ్ల వయసు ఉన్న బాలికలు బట్టలు లేకుండా బుజాలపై కర్రను మోస్తూ కనిపించారు. వారితో పాటు కొంత మంది మహిళలు పాటలు పాడుతూ ఉన్నారు. మరో వీడియోలో.. వానలు లేక పంటపొలాలు ఎండిపోతున్నందున ఈ పూజలు చేసిట్లు కొంత మంది మహిళలు చెబుతున్నారు. ఇలా చేస్తే వర్షాలు వస్తాయని చెప్పారు.

ఇదీ చూడండి: lady harassed : మహిళను నడివీధుల్లో నగ్నంగా ఊరేగించారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.