ETV Bharat / bharat

రెండు నెలల చిన్నారిపై తల్లి దారుణం.. ఆస్పత్రి మూడో ఫ్లోర్​ నుంచి కిందకు పడేసి..

రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది ఆమె తల్లి. ఈ హృదయవిదారక ఘటన గుజరాత్​లో వెలుగుచూసింది. పుట్టినప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల ఇలా చేశానని నిందితురాలు పోలీసుల విచారణలో చెప్పింది. మరోవైపు, ఆవుదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

mother kills daughter
చిన్నారిని చంపిన తల్లి
author img

By

Published : Jan 2, 2023, 1:46 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ తన రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..
ఆనంద్ జిల్లాకు చెందిన ఆసిఫ్ మియా మాలెక్ అనే వ్యక్తితో ఫర్జానాబానుకు వివాహమైంది. రెండు నెలల క్రితం ఈ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. చిన్నారికి పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వడోదరలోని ఓ ఆస్పత్రిలో 24 రోజుల పాటు ఉంచి చికిత్స చేయించారు. అయినప్పటికీ చిన్నారి ఆరోగ్యం కుదుటపడకపోవడం వల్ల వైద్యుల సిఫార్సు మేరకు నడియాడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల అహ్మదాబాద్ గవర్నమెంట్ ఆస్పత్రికి అంబులెన్స్​లో తరలించారు.

అహ్మదాబాద్​ ప్రభుత్వాస్పత్రిలో మూడో అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో చిన్నారి చికిత్స పొందుతోంది. ఆదివారం వేకువజామున 5 గంటలకు ఫర్జానాబాను.. వెయిటింగ్ రూమ్‌లో నిద్రిస్తున్న భర్తను లేపింది. చిన్నారి కనిపించట్లేదని అతడికి చెప్పింది. ఆ తర్వాత కూతురు కోసం ఇద్దరు వెతికారు. ఎంతకీ కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫోన్ చేశాడు ఆసిఫ్​. అలాగే ఆస్పత్రి సెక్యూరిటీకి సైతం ఫిర్యాదు చేశాడు. దీంతో ఆస్పత్రిలో సిబ్బంది వార్డులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. అందులో ఫర్జానాబాను ఉదయం 4.15 గంటలకు చిన్నారిని తీసుకుని బయటకు వెళ్లినట్లు రికార్డైంది. ఆమె వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావడం కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన కుమార్తె పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోందని నిందితురాలు పోలీసులకు చెప్పింది. అందుకే ఆమెను ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికు పడేసి హత్య చేశానని వెల్లడించింది.

ఆవుదూడపై దారుణం..
కర్ణాటక రాయచూర్​లో దారుణం జరిగింది. ఆవుదూడపై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిందీ ఘటన. దూడను పొలంలో మేతకు వదిలాడు యజమాని. ఆ సమయంలో నిందితుడు ఆ మూగజీవిని చెట్టుకు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు దూడ యజమానికి తెలిపారు. యజమాని ఫిర్యాదుచో నిందితుడిపై లింగసగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అరెస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.