mother fought with tiger for son: మధ్యప్రదేశ్లో ఓ తల్లి ప్రదర్శించిన ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రసంశలు అందుతున్నాయి. కుమారుడిని నోటితో కరుచుకుపోతున్న చిరుతతో పోరాడి బిడ్డను రక్షించుకుంది బైగా తెగకు చెందిన కిరణ్ అనే మహిళ. సిద్ధి జిల్లాలోని బరిజహారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది కిరణ్. ఓ బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత ఓ పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పరుగులు పెట్టింది. వెంటనే దానిని వెంబడించింది కిరణ్. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించింది. చిరుతతో పోరాడి కుమారుడిని రక్షించింది.
తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా.. అంతలోనే గ్రామస్థులు వచ్చి దానిని పారదోలారు. గాయపడిన తల్లిబిడ్డలను ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: బుల్ ఫెస్టివల్లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..