ETV Bharat / bharat

బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది వర్షాలు తక్కువే.. కరవు వచ్చే ప్రమాదం! - 2023 ఇండియాలో వర్షపాతం అంచనా

ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్​ తెలిపింది. ఎల్​ నినో కారణంగా అధిక వేడి నమోదు అవుతుందని తెలిపింది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ తెలిపింది.

monsoon 2023 rainfall data Skymet forecasts

author img

By

Published : Apr 10, 2023, 4:30 PM IST

Updated : Apr 10, 2023, 6:00 PM IST

ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్​ అంచనా వేసింది. వచ్చే వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదు కావడానికి అవకాశాలు లేవని తెలిపింది. ఇలా జరగడానికి మొదటి కారణం ఎల్​ నినో అని పేర్కొంది. ట్రిపుల్-డిప్-లా నినా (భూమద్ధ రేఖ వెంబడి పసిఫిక్​ మహాసముద్రంలో ఉపరితలంపై సంవత్సరాల పాటు చల్ల బడడం. ఇది కరవు, విపరీతమైన గాలులు, భారీ వర్షాలకు కారణమవుతుంది) కారణంగా.. నైరుతి రుతుపవనాల వల్ల.. గత నాలుగు సీజన్లలో సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని స్కైమెట్​ మేనేజింగ్ డైరెక్టర్​ జతిన్​ సింగ్​ తెలిపారు. ఇప్పుడు లా నినా ముగిసిందని.. ఎల్​ నినో ప్రభావం ఎక్కువైందని చెప్పారు. ఇలా.. ఎల్​ నినో ప్రభావం పెరిగితే రుతుపవనాలు బలహీన పడి తక్కువ వర్షపాతం నమోదవుతందని తెలిపారు.

వర్షపాతం తగ్గడానికి మరో కారణం ఐఓడీ (ఇండియన్​ ఓషియన్​ డైపోల్​). దీన్ని ఇండియన్ నినో అని కూడా అంటారు. దీని వల్ల వర్షాకాలంలో నెలవారీ వర్షపాతంలో వైరుద్ధ్యం ఏర్పడుతుందని స్కైమెట్​ పేర్కొంది. దీని కారణంగా ఉత్తరాదిలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. జులై, ఆగస్టు నెలల్లో గుజరాత్​, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సాధారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్​లో సీజన్ రెండో భాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్​ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా చల్లదనం లాంటివి నమోదవుతాయి. ఇలాంటి పరిణామాలను 'ఎల్​ నినో సదరన్ ఆసిలేషన్ సిస్టమ్ (ఈఎన్​ఎస్​ఓ)'​ అంటారు. ఈ ఈఎన్​ఎస్​ఓ పరిస్థితులు.. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతను, వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి. ఇందులో మూడు ఫేజ్​లు ఉంటాయి. అవి.. ఈఎన్​ఎస్​ఓ న్యూట్రల్(ఎల్ నినో, లా నినా కాకుండా)​, ఎల్​నినో, లానినో.

న్యూట్రల్​ ఫేజ్​లో పసిఫిక్​ మహాసముద్ర ఉపరితలం మీదుగా తూర్పు నుంచి పడమరకు గాలులు వీస్తాయి. అలా వెచ్చని తేమను పశ్చిమానికి తీసుకువస్తాయి. దీంతో మధ్య పసిఫిక్​ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎల్​ నినో వల్ల మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రం పైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది. హిందూ మహా సముద్రంపై ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో భారత దేశంలోకి వీచే నైరుతి రుతుపవనాలు.. పెరూ దేశం తీరం వైపు ప్రయాణిస్తాయి. దీంతో భారత్​లో వర్షపాతం తగ్గుతుంది. ఇక, లానినో దీనికి పూర్తిగా విరుద్ధం. ఇండియా వైపు అధిక రుతుపవనాలు వీచి.. భారీ వర్షాలు కురుస్తాయి.

Last Updated : Apr 10, 2023, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.