Modi Photo In Ration Shop: తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఓ పని స్థానికంగా రాజకీయ దుమారం రేపింది. కోయంబత్తూరులోని ఓ రేషన్ దుకాణానికి వెళ్లిన ఆయన అక్కడ గోడకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని అమర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![Modi's photo hangs up in Ration shop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-cbe-04-bjp-annamalai-visu-7208104_13042022220743_1304f_1649867863_129_1404newsroom_1649949047_303.jpg)
అసలు ఏమైందంటే.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హాజరయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరు కార్పొరేషన్ గోల్డ్‌విన్ దురైసామి నగర్ ప్రాంతంలోని రేషన్ దుకాణం ఎదుట ఆయన ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత రేషన్ షాపు గోడకు ప్రధాని మోదీ ఫొటోను అమర్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆ దుకాణంలో ఇదివరకే మాజీ సీఎం కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ఫొటోలు ఉన్నాయి. అన్నామలై వచ్చి మోదీ ఫొటో పెట్టడం ఇప్పుడు.. చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: