ETV Bharat / bharat

'ప్రజల్లో 'వికసిత్‌ భారత్‌' స్ఫూర్తి- నాటునాటుకు ఆస్కార్​తో దేశమంతా ఫుల్ ఖుషీ'

Modi Mann Ki Baat Today : 2023లో దేశ ప్రజల్లో వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి రగిలిందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దాన్ని కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాదిలో భారత్ ఎన్నో విజయాలను సాధించిందని గుర్తుచేశారు.

Modi Mann Ki Baat Today
Modi Mann Ki Baat Today
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 1:51 PM IST

Modi Mann Ki Baat Today : 2023లో భారత్‌ అనేక రంగాల్లో విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఏడాది దేశ ప్రజల్లో వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి రగిలిందని, దాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మన్ కీ బాత్‌ 108వ ఎపిసోడ్‌లో ప్రధాని సూచించారు. దేశ ప్రజలకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫిట్ ఇండియా సాకారం దిశగా ముందుకు సాగాలని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ చిట్కాలను ఈ కార్యక్రమంలో మోదీ వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం సహా ఈ ఏడాది భారత్‌ ఎన్నో ప్రత్యేక విజయాలను సాధించిందని ప్రధాని గుర్తు చేశారు.

'దేశ ప్రజల్లో స్వయం సమృద్ధి స్ఫూర్తి రగిలింది'
భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్‌ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

'నాటునాటుకు ఆస్కార్​- దేశమంతా ఉర్రూతలూగింది'
ఈ ఏడాది నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం వల్ల దేశం మొత్తం ఉర్రూతలూగిందని మోదీ తెలిపారు. ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు సైతం ప్రతిష్టాత్మక అవార్డు రావటం వల్ల భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు. 2023లో భారతీయుల సృజనాత్మకతను యావత్‌ ప్రపంచం వీక్షించిందని తెలిపారు. ఈ ఏడాదిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని మోదీ కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు.

'చంద్రయాన్​-3 అందరికీ గర్వకారణం'
చంద్రయాన్‌-3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతమైందని, ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోందన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని మోదీ చెప్పారు. రాముడి కళా భావాలను #ShriRamBhajan హ్యాష్‌టాగ్‌తో షేర్ చేయాలని మోదీ నెటిజన్లను కోరారు.

'తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణిచివేశాం- భారత్ సామర్థ్యానికి ఇదే నిదర్శనం'

'మహిళాశక్తికి 'చంద్రయాన్​-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.