mirror writing: కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన అక్షిత హెగ్డే అనే యువతి.. మిర్రర్ రైటింగ్‌లో అరుదైన రికార్డు సాధించారు. కన్నడ ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథమైన మంకుతిమ్మన కగ్గలోని 13 పద్యాలను 45.11 నిమిషాల్లో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డులు ఒడిసిపట్టారు అక్షిత అనే యువతి. ఈ తక్కువ సమయంలోనే 52 లైన్లను పూర్తి చేశారు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆమె చోటు సంపాదించారు.
ఉడిపి జిల్లా కుక్కేహళ్లి దొడ్డబీడుకు చెందిన సుభాశ్ చంద్ర హెగ్డే, జయలక్ష్మి దంపతుల కుమార్తె అక్షిత. ఆమె నిట్టే జస్టిస్ కెఎస్ హెగ్డే ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే సంస్థలో పరిశోధన విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
అక్షిత తాను రాసిన చేతిరాతను మార్చిలో.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు. వారు అక్షిత ప్రతిభను గుర్తించి కుడి నుంచి ఎడమకు రాయమని ప్రోత్సహించారు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న అక్షిత 3-4 రోజులు సాధన చేసి.. మిర్రప్ రైటింగ్‌ను నేర్చుకున్నారు. ఓ వీడియో క్లిప్‌ను ఏప్రిల్‌లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు.
"నా మిర్రప్ రైటింగ్‌ను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నా మిర్రర్ రైటింగ్ వీడియో చూసి చాలా మంది తుళు భాషలో రాసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. నా ప్రతిభను గుర్తించిన సంస్థకు ధన్యవాదాలు. నా తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్నేహితులు, ఉపాధ్యాయులు అందరూ నాకు అండగా నిలిచారు."
-అక్షిత హెగ్డే
ఇదీ చదవండి