బంగాల్ భీర్భూమ్ జిల్లాలోని శాంతినికేతన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన్సుల్ దంగ గ్రామంలో.. బాధితురాలు తన ఇంట్లో ఉండగా.. ముగ్గురు అక్కడి వెళ్లి ఆమెను అపహరించారు. సమీపంలోని మరో నివాసానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మైనర్ అరుపులు విన్న వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు. అప్పటికే నిందితులు పారిపోయారు.
బాధితురాలిని శాంతినికేతన్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చరణ్ సోరెన్, మేతే సోరెన్, మేలే సోరెన్గా గుర్తించారు. వైద్యపరీక్షల కోసం బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితురాలని కఠినంగా శిక్షించాలని గ్రామపెద్దతో పాటు గ్రామస్థులంతా డిమాండ్ చేశారు.
రాజస్థాన్లో..
రాజస్థాన్ దౌస జిల్లాలో ఓ 30ఏళ్ల మహిళపై నలుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితులకు బాధితురాలి స్నేహితురాలు సహాయం చేసింది.
హరియాణాకు చెందిన బాధితురాలు, నిందితులతో పాటు ఆదివారం కారులో దౌసకు వెళ్లింది. వారందరు మద్యం సేవించారు. కారును ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. బాధితురాలి స్నేహితురాలు బయట నిల్చుని కాపలా కాసింది. లోపల బాధితురాలిపై మిగిలిన నలుగురు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది జరిగిన కొద్దిసేపటికి.. విజోరి గ్రామానికి సమీపంలో బాధితురాలిని నడిరోడ్డు మీద విడిచిపెట్టి మిగిలిన వారు వెళ్లిపోయారు. ఆర్ధరాత్రి సమయంలో మహిళను గుర్తించిన పోలీసులు, వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేశారు. చికిత్స అందించారు.
పూర్తి విషయాన్ని పోలీసులకు బాధితురాలు వివరించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. బాధితురాలి స్నేహితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:- పసికందుపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా...