ఉత్తర్‌ప్రదేశ్‌లో కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం(Rape Victim) చేశారు ఇద్దరు మృగాళ్లు. బాధిత బాలిక కుటుంబం సోమవారం రాత్రి 11 గంటలకు బదర్‌పుర్ నుంచి ఆరియాకు బయలుదేరింది. అయితే అర్ధరాత్రి సాంకేతిక కారణంతో బస్సు నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులతో పాటు.. బాలిక కుటుంబం బస్సులో నుంచి కిందకు దిగింది. అయితే బస్ కండక్టర్ బబ్లూ, అతని సహాయకుడు అశుతో కలసి స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తల్లిని అడ్డుకుని.. తప్పించుకుపోయి..
జరిగిన విషయాన్ని బస్సు వద్దకు వచ్చిన తల్లితో బాలిక వివరించింది. అయితే అప్పటికే బయలుదేరిన బస్సును ఆపడానికి ప్రయత్నించిన తనను కండక్టర్ బబ్లూ, అశు వెనక్కి లాగారని బాలిక తల్లి వాపోయింది. మార్గమధ్యలో వారిద్దరూ దిగిపోయారని పేర్కొంది. మంగళవారం ఉదయం శికోహాబాద్ చేరుకున్న వెంటనే ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశును అరెస్టు చేశామని, బబ్లూను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
దళిత చిన్నారిపై..
ఉత్తర్‌ప్రదేశ్‌లో(UttarPradesh Rape News) దళిత బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. అలీగఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి దగ్గర్లోని పొలాల్లో 8 ఏళ్ల దళిత బాలిక మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బాలిక పాఠశాలకు వెళ్లింది. కానీ ఆ బాలిక బడికి రాలేదని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీనితో వెతకడం ప్రారంభించగా సమీప పొలాల్లో ఆమె స్కూల్ బ్యాగ్‌ను గమనించిన స్థానికులు తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు టప్పల్-లాల్‌పుర్ రహదారిపై రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. హత్య జరగడానికి ముందు బాలికపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ.. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు నిరాకరించారు.
అయితే.. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని(UP Rape Victim Case) ఇచ్చేలా ఒప్పించారు. దీనితో వైద్య బృందం అర్ధరాత్రి పోస్ట్‌మార్టం నిర్వహించింది.
పొరుగు వ్యక్తి ఘాతుకం..
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటన రాజస్థాన్‌లో(Rajasthan Rape Victim Latest News) జరిగింది. నాగౌర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో పొరుగున ఉండే వ్యక్తే నిందితుడని పోలీసులు తెలిపారు.
'పాడు కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసించే దినేష్ జాట్ బాలికను కిడ్నాప్ చేసి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు' అని అశోక్ బిషు అనే పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్లు వివరించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు.
బాలిక హత్యాచారంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా నిలుస్తామని మెర్టా శాసనసభ్యురాలు ఇందిరా బావ్రీ తెలిపారు.
బంధువుతో గుడికి వెళ్లగా..
19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన మహారాష్ట్ర పుణె జిల్లాలో జరిగింది. ఓ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి(Maharashtra Rape Victim) భర్తకు బంధువు అయిన వ్యక్తితో పాటు.. అతని స్నేహితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
"గ్రామానికి చెందిన యువతి తన భర్తకు చెందిన బంధువులతో గుడికి వెళ్లింది. అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరిద్దరూ బలవంతంగా అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించగా కండువాతో గొంతు నొక్కి చంపేశారు. ఆమెను గుర్తుపట్టకుండా ముఖాన్ని దారుణంగా ఛిద్రం చేశారు."
-పోలీసులు
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. మహిళ బంధువును అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: