ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్! శిశువును ఏం చేసిందంటే? - యూట్యూబ్​ చూసి బిడ్డ జననం

మహారాష్ట్రలో ఓ​ బాలిక యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

minor girl delivers baby watching youtube
యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
author img

By

Published : Oct 17, 2022, 9:03 PM IST

మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొండ్వాలోని ధ్వాడేకు చెందిన ఓ బాలిక యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. దీనిపై ఉత్తమ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా కమీషన్​ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏం జరిగిందంటే
బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్​ గర్భవతి కావచ్చేమో అని అనుమానించి.. సోనోగ్రఫీ పరీక్ష చేయించాలని సూచించారు. వైద్యులు సూచించినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్లారు తల్లీకూతురు. ఇదిలా ఉండగా.. వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు స్థానికులకు కనిపించింది. అదే రోజు రాత్రి బాలిక ఆస్పత్రిలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. తానే యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చానని.. తరువాత బిడ్డను కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.