ETV Bharat / bharat

పదేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారం - రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారం

minor gangrape Jharkhand: పదేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో గటనలో మూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి.. బావిలో పడేశాడు ఓ కామాంధుడు. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో జరిగింది.

minor gangrape jharkhand
మైనర్​పై సామూహిక అత్యాచారం
author img

By

Published : Apr 23, 2022, 8:06 PM IST

Updated : Apr 23, 2022, 9:10 PM IST

minor gangrape Jharkhand: పదేళ్ల బాలిక​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు మైనర్లు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని కుంటీలో జరిగింది. బాధితురాలు తన పక్క గ్రామంలో జరిగిన వివాహానికి గురువారం హాజరై తిరిగి వస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు వివాహం దగ్గర గొడవ జరిగింది. దీంతో బాధితురాలు ఇంటికి ఒంటరిగా వస్తున్న సమయంలో బాలికను అడ్డగించిన నిందితులు.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న బాలికి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పలుమార్లు అత్యాచారం..: 16 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. ఈ ఘటన రాజస్థాన్​లోని ఝలావర్​లో జరిగింది. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్​ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 9వ తేదీన నిందితుల్లో ఒకరు తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులు ముగ్గురు పలుమార్లు అత్యాచారం చేశారని తెలిపింది.

అత్యాచారం చేసి.. అనంతరం బావిలో: మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి బావిలో పడేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​ జిల్లాలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన తల్లితో కలిసి బంధువుల వివాహానికి వెళ్లింది. అక్కడ బాలిక ఆడుకుంటుండగా నిందితుడు రమేష్ ధన్కడ్(30) వచ్చాడు. బాలికతో కలిసి ఆడాడు. అనంతరం బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి.. గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రమేష్​పై పోలీసులు.. పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేశారు.

పెళ్లి చేసుకుంటానని: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేసింది ఓ మహిళా కానిస్టేబుల్​. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిలిబెత్​లో జరిగింది. బాధితురాలు పని చేసే స్టేషన్​లోనే నిందితుడు మోహిత్ ఖోఖర్ అనే వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నాడు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మార్చి 24వ తేదీన వేరొక మహిళను వివాహం చేసుకోవటం వల్ల బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు మోహిత్​, మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: హనుమాన్ చాలీసా సవాల్​.. నటి నవనీత్ కౌర్​ ఇంటిపై రాళ్ల దాడి!

Last Updated : Apr 23, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.