ETV Bharat / bharat

యంగెస్ట్ మేయర్, ఎమ్మెల్యే వివాహం.. హాజరైన సీఎం విజయన్ - అతి తక్కువలోనే మేయర్

Mayor Arya Rajendran Wedding: తిరువనంతపురం మేయర్, బలుస్సెరి ఎమ్మెల్యే సచిన్ దేవ్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త దంపతులను కేరళ సీఎం పినరయి విజయన్ ఆశీర్వదించారు. నిరాండంబరం జరిగిందీ ఆ వివాహ వేడుక.

mayor arya rajendran wedding
మేయర్ ఆర్యా రాజేంద్రన్ పెళ్లి
author img

By

Published : Sep 5, 2022, 6:44 PM IST

మేయర్ ఆర్యా రాజేంద్రన్ పెళ్లి

Mayor Arya Rajendran Wedding: దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్​గా వార్తల్లోకెక్కిన ఆర్యా రాజేంద్రన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్​ను ఆమె వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని ఏకేజీ సెంట్రల్ హాల్​లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్​వీ గోవిందన్, మంత్రులు శివన్​కుట్టి, మహ్మద్​ రియాజ్, ఆంటోని రాజు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇరువురు దంపతులు పూల దండలు మార్చుకున్నారు.

mayor arya rajendran wedding
మేయర్ ఆర్యా రాజేంద్రన్ పెళ్లి

తమ పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురావొద్దని గతంలోనే చెప్పారు. తమకు గిఫ్ట్​లు ఇచ్చే బదులు అనాథ ఆశ్రమాలకు సాయం చేయాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్​కు డబ్బులు ఇవ్వాలని కోరారు. బలుస్సెరి అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించడం వల్ల పెళ్లి పీటలెక్కారు.

mayor arya rajendran wedding
మేయర్ ఆర్యా రాజేంద్రన్ పెళ్లి

యంగెస్ట్ మేయర్.. ఆర్య తండ్రి రాజేంద్రన్‌ ఎలక్ట్రీషియన్‌. తల్లి శ్రీలత ఎల్‌ఐసీ ఏజెంట్. మొదటి నుంచీ వీరి కుటుంబం సీపీఎం మద్దతుదారులు. ఈ క్రమంలో ఆరేళ్ల వయసులోనే వామపక్షాల ఆధ్వర్యంలో నడిచే బాల సంఘంలో చేరారు ఆర్య. ఆసియాలోనే అత్యధిక మంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పది లక్షల మంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ద్వారా స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం సంపాదించుకున్నారు ఆర్య. ఆ ఆత్మవిశ్వాసంతోనే కాలేజీలోనూ తోటి విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతూ వచ్చారు. ఈ క్రమంలో బాల సంఘం తరఫున చురుగ్గా సేవలదిస్తుండడంతో ఆమెను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది సీపీఎం అధిష్ఠానం. అలాగే విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో చేరి తోటి విద్యార్థుల హక్కుల కోసం గళమెత్తారు ఆర్య.

రాజకీయాలతోనే అభివృద్ధి!
పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు ఆర్య. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులపై దృష్టి పెట్టి వారిని బృందాలుగా తయారుచేశారు. తమ అవసరాలు, అభిప్రాయాలను పాలకుల ఎదుట వినిపించేలా వారిలో ధైర్యం నింపారు. అయితే రాజకీయాల ద్వారానే అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయని నమ్మిన ఆమె తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. ముదవన్ముగల్ వార్డు కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన ఆమె సీపీఎం తరఫున పోటీ చేసిన అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం. 2020లో జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్య.. అతి పిన్న వయసులోనే మేయర్‌గా ఎన్నికై వార్తల్లో నిలిచారు. అప్పటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఈమె ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ కమిటీ మెంబరుగానూ వ్యవహరిస్తున్నారు.

ఎవరీ సచిన్​ దేవ్​.. ఇక ఆర్య మనువాడిన సచిన్‌ దేవ్ (28) కేరళ అసెంబ్లీలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. సచిన్ తండ్రి కేఎమ్‌ నందకుమార్‌ విశ్రాంత ఉద్యోగి. తల్లి షీజ ప్రభుత్వ టీచర్. సచిన్‌ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సచిన్‌కి ప్రజాసేవంటే చాలా ఇష్టం. అతని పొలిటికల్‌ కెరీర్‌ కూడా ఎస్‌ఎఫ్‌ఐతోనే మొదలైంది. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై గళమెత్తారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. గత సంవత్సరం కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బలుస్సెరి నియోజక వర్గానికి సీపీఎం తరఫున పోటీ చేసి గెలుపొందారు. తద్వారా ఆ ఎన్నికల్లో గెలుపొందిన అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

ఇవీ చదవండి: రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ

'నా చిరునవ్వుకు కారణం.. ఎన్డీఏను వీడడమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.