ETV Bharat / bharat

సీఎం ఇంట్లోకి ఆగంతుకుడు.. అర్ధరాత్రి గోడ ఎక్కి.. రాత్రంతా... - మమతా బెనర్జీ ఇల్లు

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి గోడ ఎక్కి తెల్లారేవరకు అక్కడే కూర్చున్నాడు. ఈ భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు.

Massive security breach at Mamata Banerjee's residence

author img

By

Published : Jul 3, 2022, 5:22 PM IST

Security Breach at Mamata Residence: బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతా లోపం తలెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కోల్​కతా కాళీఘాట్​లోని సీఎం నివాసంలోకి ప్రవేశించాడు. రాత్రంతా ఆ వ్యక్తి.. ఇంటి గోడపైనే మౌనంగా కూర్చొని ఉన్నట్లు తెలిసింది. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం.. ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సీఎం మమతా బెనర్జీకి కూడా జెడ్​ ప్లస్​ సెక్యూరిటీ ఉంది. అయితే.. ఇంత నిఘా ఉన్నప్పటికీ.. ఆ వ్యక్తి అర్ధరాత్రి ఎలా వచ్చాడో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

దీదీ ఇంటి సమీపంలోనే కొద్దిరోజుల క్రితం జంట హత్యలు కలకలం రేపాయి. అప్పుడు కూడా మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఆ సమయంలో.. దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'ప్రధాని భద్రతా లోపం' విచారణ కమిటీ ఛైర్మన్​కు బెదిరింపులు!

'ప్రియాంక'తో సెల్ఫీ కోసం.. దూసుకొచ్చిన కారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.