ETV Bharat / bharat

ప్రియుడి ఇంట్లో వివాహిత అలా.. మహిళను తాళ్లతో కట్టేసి దేహశుద్ధి! - meet her boyfriend

ప్రియుడి వద్దకు వెళ్లిన ఓ వివాహితను గ్రామస్థులు బంధించి హింసించారు. తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు.

married-woman-tied-rope
married-woman-tied-rope
author img

By

Published : Aug 7, 2022, 10:25 AM IST

బాయ్​ఫ్రెండ్​ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళకు దేహశుద్ధి చేశారు గ్రామస్థులు. తాళ్లతో కట్టేసి బంధించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ సిద్ధార్థ్​నగర్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే
మాధవ్​పుర్​లోని పురైనా ప్రాంతానికి చెందిన వివాహిత.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఆమె భర్త పని నిమిత్తం రాజస్థాన్​లో ఉంటున్నాడు. మహిళ ప్రియుడికి సైతం ఇదివరకే పెళ్లైంది. అయినప్పటికీ ఇరువురూ ప్రేమలో పడ్డారు. ఇటీవల మహిళ.. తన ప్రియుడిని కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే గ్రామస్థులు వారి వద్దకు వెళ్లారు. ఇరువురినీ బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో వివాహిత ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే ఉండిపోయిన మహిళను స్థానికులు తాళ్లతో కట్టేశారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన షోహ్రాత్గడ్ పోలీసులు.. ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అయి ఉంటుందని తెలిపారు. దర్యాప్తు కోసం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ వెల్లడించారు. 'మహిళను తాళ్లతో కట్టేసి కొడుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం' అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.