ETV Bharat / bharat

లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం

lift accident in ahmedabad
లిఫ్ట్ ప్రమాదం
author img

By

Published : Sep 14, 2022, 1:16 PM IST

Updated : Sep 14, 2022, 5:09 PM IST

13:13 September 14

లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం

Ahmedabad Lift Accident Today : గుజరాత్ అహ్మదాబాద్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్​ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2​ భవనంలో లిఫ్ట్ షాఫ్ట్​ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత కూలీలతో వెళ్తున్న లిఫ్ట్​ కూలిందని భావించారు పోలీసులు. అనంతరం విచారించగా లిఫ్ట్​ షాఫ్ట్ కూలిపోవడమే ప్రమాదానికి కారణమని తేలింది.

"ఆరుగరు కూలీలు గ్రౌండ్​ ఫ్లోర్​లో లిఫ్ట్​కు​ మరమ్మతులు చేస్తున్నారు. 13వ ఫ్లోర్​లో ఉన్న లిఫ్ట్ షాఫ్ట్​ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఐదో అంతస్తులో ఉన్న ఇద్దరు కూలీలు అదుపుతప్పి లిఫ్ట్​ గుంతలో పడిపోయారు. మొత్తం 8 మంది కూలీలపై షాప్ట్​ పడగా.. ఏడుగురు మరణించారు." అని పోలీసులు తెలిపారు. మృతులను పంచమహల్​ జిల్లాలోని ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్​ఛార్జి జయేశ్​ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్​ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు.

Last Updated : Sep 14, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.