ETV Bharat / bharat

కన్నతండ్రిని చంపిన కుమారుడు.. అనంతరం సవతి తల్లిపై అత్యాచారం.. ఆఖరికి.. - రైలలో నుంచి యువకుడిని తోసేసి హత్య

తండ్రిని చంపి, సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఒడిశాలో ఈ దారుణం జరిగింది. మరోవైపు.. తోటి ప్రయాణికుడిని రైలులో నుంచి తోసేశాడు ఓ వ్యక్తి. ఈ అమానవీయ ఘటన కేరళలో వెలుగుచూసింది.

man-killed-father-and-raped-stepmother-in-odissa-slash
సవతి తల్లిపై వ్యక్తి అత్యాచారం
author img

By

Published : Mar 7, 2023, 9:13 PM IST

కన్న తండ్రిని పొడిచి చంపాడో వ్యక్తి. అనంతరం సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. టామ్​కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 65 తండ్రిని 20 ఏళ్ల కొడుకు పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. నిందితుడి తండ్రి, సవతి తల్లి కలిసి సొంతూరులో ఉంటున్నారు. కొడుకు తన తండ్రితో కలిసి ఉండేందుకు సవతి తల్లి ఒప్పుకోలేదు. దీంతో నిందితుడు ఒంటరిగా మరో గ్రామంలో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి నిందితుడు.. తన తండ్రి ఇంటికి వెళ్లాడు. సవతి తల్లి పట్ల మూర్ఖంగా ప్రవర్తించాడు. తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. భార్యకు మద్ధతుగా మాట్లాడాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో తండ్రిపై కోపంతో ఓ పదునైన ఆయధంతో అతడిని నరికాడు కొడుకు. తీవ్ర గాయాలతో నిందితుడి తండ్రి మరణించాడు. అనంతరం సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. నిందితుడిని సోమవారం పట్టుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

రైలులో నుంచి తోసేసి యువకుడి హత్య..
తోటి ప్రయాణికుడిని కదులుతున్న రైలులో నుంచి తోసేశాడు ఓ వ్యక్తి. ఘటనలో బాధిత యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన సోనాయ్​ ముత్తు అనే వ్యక్తి.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేరళలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. అతడు ఓ వలస కూలీ అని సమాచారం. 'రైలు ప్రయాణంలో ఇద్దరు గొడవ పడ్డారు. కాసేపటికి ఆ గొడవ మరింత తీవ్రంగా మారింది. దీంతో బాధితుడిని ముత్తు బయటకు తోసేశాడు. రైలు నుంచి కిందపడ్డ అతడు ప్రాణాలు కోల్పోయాడు.' అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రైలులో ఉన్న ప్రయాణికుల ఫిర్యాదు మేరకు.. కోజికోడ్ రైల్వే స్టేషన్​లో ముత్తుని పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల నిమిత్తం కోజికోడ్​ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.