ETV Bharat / bharat

చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రీకూతుళ్లు.. ఏమైంది? - కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య

రాజస్థాన్​లోని బాడ్మేర్​ జిల్లాలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.

d
d
author img

By

Published : Jun 17, 2022, 5:29 PM IST

ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని బాడ్మేర్​ జిల్లాలో వెలుగు చూసింది. ఈ దుర్ఘటన గురువారం రాత్రి జరిగిందని.. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి తమకు సమాచారం అందించారని పోలీసులు వెల్లడించారు. మృతులు.. శంకర్​ రామ్​ (55), సువా (28), ఘుడి(15)గా గుర్తించారు.

అదే కారణం?..: కుటుంబకలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఘటనకు ముందు ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగి ఉంటుందని.. మనస్తాపం చెందిన వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు. అయితే వారి మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి : అగ్నిపథ్​పై నిరసనలతో టెన్షన్​ టెన్షన్​.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.