ETV Bharat / bharat

కోడలితో పారిపోయిన వ్యక్తి.. కొడుకు బైక్​పైనే జంప్.. తన భార్యకేం తెలీదంటున్న బాధితుడు - రాజస్థాన్ వార్తలు

ప్రేమ చాలా గుడ్డిది అంటారు. కొన్నిసార్లు అది వింతగా కూడా ఉంటుంది. దీనికి గొప్ప ఉదాహరణ రాజస్థాన్​లోని ఒక జంట. కన్నకొడుకు భార్యతోనే పారిపోయాడు ఓ వ్యక్తి. అంతేగాక కొడుకు బైక్​ను కూడా వెంట తీసుకెళ్లాడు.

man falls in love with son wife and elopes with her
రాజస్థాన్​లో కొడుకు భార్యతో పారిపోయాడు ఓ వ్యక్తి
author img

By

Published : Mar 5, 2023, 10:42 AM IST

రాజస్థాన్​లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కోడలితో కలిసి పారిపోయాడు. అంతే కాకుండా కొడుకు బైక్​ను కూడా తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న కొడుకు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత సంఘటన బుందీ జిల్లాలోని సిలోర్ గ్రామంలో జరిగింది.

గ్రామంలో బాధితుడు పవన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి తన భార్యకు ఏవో మాయ మాటలు చెప్పి.. ఆమెను తీసుకొని పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అమాయకురాలని, తనకు అలా వెళ్లేంత తెలివి కూడా లేదని వాపోయాడు. తన తండ్రే ఏదో మోసం చేసి తన భార్యను తీసుకొని పారిపోయాడని ఆరోపించాడు. అదేగాక తన బైక్​ను కూడా తీసుకెళ్లిపోయాడని చెప్పాడు.

'నా తండ్రి డబ్బు సంపాదించడం కోసం కొన్ని చట్టవిరుద్ధ పనులు చేశాడు. నేను పని నిమిత్తం సొంత గ్రామానికి దూరంగా ఉంటున్నాను. అయితే నా తండ్రి.. నా భార్యను తీసుకెళ్లడమే కాకుండా బైక్​ను కూడా అపహరించి తీసుకెళ్లాడు. తన తండ్రి ఆమెను ఎలా ఆకర్షించాడో తెలియడం లేదు. కానీ నా భార్య చాలా అమాయకురాలు. నా తండ్రి బలవంతం చేయకుంటే ఆమె ఈ పని చేసుండేది కాదు' అని పవన్ చెప్పుకొచ్చాడు.

తన కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని పవన్ ఆరోపించారు. పవన్ ఆరోపణలపై సదరు స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ స్పందించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, దొంగిలించిన ద్విచక్ర వాహనంతో పాటు పారిపోయిన ఇద్దరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరి ఆచూకీకి సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు.

తమిళనాడులో విద్యార్థికి ప్రేమ పాఠాలు
ఇలాంటి ఘటనే ఇటీవల తమిళనాడులో జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు చెప్పి 17ఏళ్ల మైనర్ బాలుడిని తీసుకొని పారిపోయింది. తిరుచునాపల్లిలోని ఒక పాఠశాలలో టీచర్(26) మైనర్​ బాలుడితో సన్నిహితంగా ఉండి ప్రేమ కలిగేలా చేసింది. తరచూ ఫోన్లు మాట్లాడుతూ మరింత దగ్గరయ్యారు. ఒకరోజు ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. మైనర్ కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న టీచర్​ను అరెస్టు చేశారు.

ఇద్దరు మైనర్ల పెళ్లి
ఇటీవల.. పంజాబ్​లోని అమృత్​సర్​కు చెందిన ఇద్దరు మైనర్లు చదువుకునే వయసులోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ పంజాబ్ నుంచి పారిపోయి బిహార్​లోని జముయీకి వెళ్లారు. ఆరునెలల పాటు ఇద్దరూ జీవనం సాగించారు. వారి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి జంట మైనర్లు కావడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.