Mumbai Fire: మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 10 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కమలా బిల్డింగ్‌లో ఈ ఉదయం 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ పేర్కొన్నారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.
ఇదో విచారకర ఘటన అని అన్నారు మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు మంగల్ లోధా.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: లఖింపుర్ ఘటనలో మరో ఛార్జ్‌షీట్.. రైతులపైనా అభియోగాలు..